నిత్యం అబద్ధాలతో, గోబెల్స్ ప్రచారం చేస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుతో పాటు, బీజేపీ నాయకులకు, ప్రతి సారి ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు గట్టి జర్క్ ఇస్తూ ఉంటారు. అబద్ధాలను, నిజాలు చెయ్యటంతో దిట్ట ఈ జీవీఎల్. అందుకే మొన్న రాజ్యసభలో, టీఎంసీ ఎంపీ ఒబ్రియాన్ మాట్లాడుతూ, ఢిల్లీలో జీవీఎల్ కు ఆధార్ కార్డు ఉంది, ఆయన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు అంటూ, జీవీఎల్ గాలి తెసేసారు. జీవీఎల్ నరసింహారావు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం ఉండదు. ఇలాంటి తియ్యని అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టే, ఇతన్ని రాజ్యసభలో కూర్చోబెట్టాడు అమిత్ షా..
అయితే, ప్రతి రోజు కుటుంబరావు గారి చేతిల్లో దొరికిపోవటం ఎందుకు అనుకున్నాడో ఏమో, ఈ రోజు ABN ఛానల్ లో వచ్చిన మార్నింగ్ డిబేట్ లో, అక్కడి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయాడు జీవీఎల్. పదవ షెడ్యూల్ లోని సంస్థలను విడదీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వటానికి మీకు ఇబ్బంది ఏంటి ? దీనికి ఒక్క పైసా ఖర్చు అవ్వదు ? దీని కోసం మీరు నాలుగేళ్ళు ఎందుకు తీసుకున్నారు అని అక్కడి వాళ్ళు అడిగితే, ఇది కరెక్ట్ కాదు, కాంగ్రెస్, తెలుగుదేశం కలిసిపోయి నా మీద అనవసరంగా దాడి చేస్తున్నాయి అని చెప్పి, అక్కడి వారి సమాధానాలు చెప్పలేక, జీవీఎల్ నరసింహరావు, మైక్ తీసేసి డిబేట్ లో నుంచి పారిపోయారు.
ఎందుకుంటే పదవ షెడ్యూల్ సంస్థల పై ద్రుష్టి పెట్టమని, రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు కేంద్రాన్ని కోరింది. ఈ విషయం పై ఇప్పటికే సుప్రీం కోర్ట్ కూడా ఆదేశాలు ఇచ్చింది. షెడ్యూల్ 9,10 సంస్థల విభజన, ఉన్నతవిద్యామండలి విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా ఈ సంస్థల ఆస్తులను, అప్పులను పంచుకోవాలని ఏపీ వాదిస్తోంది. పదవ షెడ్యూల్‌లో పొందుపర్చిన సంస్థల వివరాలతో అధికారులు అనేకసార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా, కేంద్రం పట్టించుకోలేదు. దీంతో ఇదే అంశం ఈ రోజుకి టీవీ చర్చల్లో రావటం, అక్కడ వారు అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పలేక, పారిపోయాడు జీవీయల్. వీడియో ఇక్కడ చూడచ్చు. https://youtu.be/xQJYTKGHKI0