ఏపి పై కేంద్రం బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి దాకా రాష్ట్రపతి పాలన పెడతాం అని చెప్పిన వారు, ఇప్పుడు మీ మీద నిఘా పెట్టాం అంటూ, ఏపి ప్రజలను ఈ ఢిల్లీ బానిసలు హెచ్చరిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దొంగ దీక్షలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు క్యాంపు కార్యాలయంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో జీవీఎల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటించిన 900కోట్ల కరువు సాయం ఈ రాష్ట్ర ప్రభుత్వ దొంగల బారిన పడనివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. ఈ నిధులను పక్కదారి పట్టనివ్వకుండా ఏపీపై కేంద్రం గట్టి నిఘా ఏర్పాటుచేసిందన్నారు. మాణిక్యాలరావు లాంటి ఎమ్మెల్యే ఉండడం మీ అదృష్టమని.. దోచుకుని తినే ఎమ్మెల్యేలు ఈ రోజు రాష్ట్రంలో వున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
మిలటరీ మాధవరం కోసం మాణిక్యాలరావు 11కోట్ల నిధులను తీసుకు రావడం గొప్ప విషయమని ఆయన ప్రశంసించారు. కేంద్రం ఇచ్చిన నిధులతో చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కియా మోటార్స్‌కూ, ఏపీ సీఎం చంద్రబాబుకూ సంబంధం లేదని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వల్లే కియా మోటార్స్ ఏపీకి వచ్చిందని వ్యాఖ్యానించారు. నాలుగున్నరేళ్లు జులాయిగా తిరిగిన చంద్రబాబు ఇప్పుడు కష్టపడుతున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు దుబారా చేస్తున్న సొమ్ము ప్రజలదని.. సోకులు చేసుకోవడానికి కాదని.. కేంద్రం ప్రకటించిన రూ.900 కోట్ల నిధులను కరవు ప్రాంతాలకే వాడాలని అన్నారు. ఈ ఖర్చులపై నిఘా ఉంటుందని జీవీఎల్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సిగ్గు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మారుస్తోందని ఆరోపించారు.
అఖిల పక్ష సమావేశంలో చంద్రబాబు ఏకాకిలా మిగిలారని.. రెండు పార్టీలను కూడా కలుపుకోలేని చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏం పోరాడుతారని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలోకెళ్లా ఏపీకే ప్రధాని మోదీ అధిక నిధులు ఇచ్చారని జీవీఎల్ స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులతో చంద్రబాబు, తనయుడు లోకేష్ లు విమానాలు, స్టార్ హోటళ్లలో విలాసవంతంగా గడుపుతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నాలుగున్నారేళ్లు జులాయిగా తిరిగి ఇప్పుడు కష్టపడుతున్నానని చంద్రబాబు చెప్పడం హస్యాస్పదం. టీడీపీలో చేరేవారంతా ప్యాకేజీల కోసమే... అని ఎంపీ జీవీఎల్ ఘాటుగా విమర్శించారు.