జీవీఎల్ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతున్నారని హీరో శివాజీ మండిపడ్డారు. మట్టి తప్ప ఏమీ లేని రాష్ట్రంలో లక్ష కోట్లు దోచుకుంటున్నారని జీవీఎల్ విమర్శిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక టీవీ ఛానల్ నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆయన అమెరికా నుంచి మాట్లాడారు. ‘‘కేంద్రాన్ని నిలదీయాల్సిన అంశాల్లోనూ రాష్ట్రాన్నే నిందిస్తున్నారు. హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని ఎందుకు విమర్శించడం లేదు?. ఇలాంటి విషయాల్లోనే ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్రాన్ని ఎందుకు చొక్కా పట్టుకొని అడగడం లేదు.’’ అని శివాజీ అన్నారు.
వైసీపీ, జనసేన, బీజేపీ త్వరలో కలిసిపోతారేమోనని హీరో శివాజీ అనుమానం వ్యక్తం చేశారు. ‘గుమ్మడికాయ దొంగల్లా విడివిడిగా ఉండడం ఎందుకు?. జగన్ ఎపిసోడ్...ఆపరేషన్ సక్సెస్..పేషెంట్ డెడ్. నన్ను టార్గెట్ చేసిన వాళ్లు అబాసుపాలవుతారు. ఏపీ పోలీసులపై జగన్ నమ్మకం లేదనడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఏపీ విషయంలో కాంగ్రెస్ రియలైజ్ అయింది. అందుకే అధికారంలోకి రాగానే హోదా ఇస్తామంటోంది. ఆపరేషన్ గరుడపై నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతోంది. ఆపరేషన్ గరుడను ప్రజలు నమ్ముతున్నారు.’’ అని శివాజీ అన్నారు.
ఎన్నికల్లో పోటీ చేయాలని తనకు లేదని హీరో శివాజీ స్పష్టం చేశారు. ఒకవేళ పోటీ చేస్తే బీజేపీ అధ్యక్షుడిపై ఇండిపెండెంట్‌గా చేస్తానని ఆయన వెల్లడించారు. ‘‘ఓ జాతీయ పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని ఆహ్వానించింది..తిర్కసరించాను. ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు పోరాటాన్ని ఆహ్వానిస్తున్నా. హోదాపై నాడు టీడీపీని విమర్శించిన మాట వాస్తవం. తిట్టమంటే తిట్టడానికి పొగడమంటే పొగడటానికి నేనెవరీ చెంచాను కాదు. వైసీపీ, బీజేపీలకు భయపడే వ్యక్తిని కాదు.’’అని అన్నారు.