ఉత్తరప్రదేశ్ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, వీకెండ్ కావటంతో, ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఈ వారం, కుటుంబరావు గారి చేతిలో కోటింగ్ కోసం, తెగ తాపత్రయ పడుతున్నాడు. వారం వారం, కొత్త కొత్త కాన్సెప్ట్ లతో, వచ్చే జీవీఎల్ ఈ వారం, కూడా మరో కొత్త కాన్సెప్ట్ తో వచ్చారు. క్లైమాక్స్ మాత్రం కుటుంబరావు గారి ఎంట్రీ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఈ వారం, ఢిల్లీ నుంచి ఆదరాబాదరాగా వచ్చి, చంద్రబాబు అమెరికా పర్యటన పై బురద జల్లుడు మొదలు పెట్టాడు జీవీఎల్. చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్తున్న ఉద్దేశం ఒకటి.. చెప్పేదొకటని విమర్శించారు. ఐక్యరాజ్యసమితిలో ఏ మీటింగ్‌కు సీఎం వెళ్తున్నారో.. వారి పంపిన ఇన్విటేషన్ ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్తున్నట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు విమానం ఎక్కే లోపే ఐక్యరాజ్యసమితి పంపిన ఇన్విటేషన్‌ను మీడియాకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ విషయంలో, చంద్రబాబు అమెరికా విమానం ఎక్కే లోపు, ఆ విషయం చెప్పలంటున్న జీవీఎల్ కు, అప్పటి దాక ఎందుకు, మేము ఒక్క నిమిషంలోనే, ఈ విషయం గురించి వివరాలు చెప్తున్నాం. అంతే కాదు, జీవీఎల్ అడుగుతున్న ఇన్విటేషన్ కూడా చూపిస్తున్నాం. కుటుంబరావు గారు వచ్చి, కోటింగ్ ఇచ్చే లోపు, జీవీఎల్ గారు, ఇది చూసుకోండి.
‘‘ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్: గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’’ అనే అంశంపై ఐక్యరాజ్య సమితిలో ప్రంసంగించాల్సిందిగా సీఎంను యూఎన్ఓ ఆహ్వానించింది. దీనికి సమబందించి, ఐక్యరాజ్య సమితి ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హెం, చంద్రబాబుకి లెటర్ రాసారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 24 నుంచి జరుగుతుందని, ‘‘ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్: గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’’ టాపిక్ మీద మీరు ప్రసంగించాలి అంటూ లెటర్ రాసారు. మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో మార్పులు చోటు చేసుకుంటుంది. సామాజికంగా, ఆర్ధికంగా, ఎన్విరాన్మెంట్ పరంగా, మీరు తీసుకుంటున్న చర్యలు అమోఘం. ముఖ్యంగా, మీరు మీ రాష్ట్రంలో, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి ఇస్తున్న ప్రాధాన్యత, వాటి ఫలితాలు మమ్మల్ని ఆకట్టుకున్నాయి. ఈ ప్రపంచం, మీ నుంచి, మీ అనుభవాలు వినాలని అనుకుంటుంది. మీ అనుభవాలు మాతో వచ్చి పంచుకుంటారని ఆశిస్తున్నా అంటూ, ఐక్యరాజ్య సమితి ఎక్జిక్యూటివ్ డైరెక్టర్, చంద్రబాబుకి లేఖ రసారు. జీవీఎల్ గారు, ఈ లేఖ చూసి పండగ చేసుకోండి...