అమ్మా పెట్టదు, అడుక్కుతిననివ్వదు అని.. వీళ్ళకు ఎలాగూ రాష్ట్రం పై ప్రేమ లేదు.. రాష్ట్ర హక్కుల కోసం, పోరాడే దమ్ము లేదు.. బానిసత్వం ఒకరిది, కేసుల మాఫీ కోసం ఒకరు.. ఇలా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. వీరే జీవీఎల్ నరసింహారావు.. A2 విజయసాయి రెడ్డి... ఇద్దరూ నిన్న కంప్లైంట్ ఇచ్చారు.. జీవీఎల్ నిన్న చేసింది ఇది... పార్లమెంటు ప్రతిష్ఠను దిగజార్చేలా తెలుగు దేశం పార్టీ ఎంపీలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎంపీలు తమ హోదాకు భిన్నంగా ప్రదర్శనలు నిర్వహిస్తూ పార్లమెంటును అభాసుపాలు చేస్తున్నారన్నారు.
పార్లమెంటు రక్షణకు సంబంధించిన సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)లో సభ్యుడినైన తాను.. ఈ అంశంపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. ఈ తరహా నాటకాలకు సోమవారంతో తెరపడుతుందన్నారు. గతంలో భాజపాతో సహా ఇతర పార్టీలు పార్లమెంటు ఆవరణలో ధర్నాలు చేశాయి కదా..మరి ఇప్పుడెలా తప్పవుతుందని విలేకరులు ప్రశ్నించగా...ఎప్పుడో ఓ సారి చేయడం తప్పుకాదని... రోజూ కొనసాగించడం సరికాదన్నారు. ఇక మరో పక్క విజయసాయి రెడ్డి కూడా ఇదే బాణీలో ఉన్నారు. లోక్‌సభను రాజ్యసభతో పోల్చి చూడొద్దని ఆయన రాజ్యసభలో ప్రసంగం చేసారు. సభ సజావుగా సాగకుండా అడ్డుకునే వారికి జీతభత్యాలు ఇవ్వకూడదు అన్నారు. అంతరాయం కలిగిన సభా సమయానికి నష్టపరిహారంగా అంతే సమయాన్ని పొడిగించాలని విలువైన సూచన చేశారు.
కొద్ది రోజుల క్రితం కూడా టీడీపీ నేతలకు జీవీఎల్ నరసింహారావు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో ప్రసంగం తర్వాత తనను టీడీపీ నేతలు బెదిరించారని నోటీసులో పేర్కొన్నారు. వీడియో ఆధారాలు రాజ్యసభ అధికారులకు ఆయన అందజేశారు. టీడీపీ వైఫల్యాలను ఎండగట్టడంతో బెదిరించారని జీవీఎల్ ఆరోపించారు. వెంకయ్య నాయుడుకి ఇచ్చిన కంప్లైంట్ లో జీవీఎల్ రాస్తూ, టీడీపీ వైఫల్యాలను రాజ్యసభ వేదికగా ఎండగట్టడంతోనే తనను టీడీపీ నేతలు బెదిరించారని జీవీఎల్ అన్నారు. టీడీపీ నేతలు తనను హెచ్చరిస్తున్న వీడియో ఆధారాలను, ప్రెస్ లో వచ్చిన వాటిని రాజ్యసభ సెక్రటేరియట్ కు ఇస్తున్నట్టు జీవీఎల్ చెప్పారు.