ఢిల్లీలో ఆధర్ కార్డు, యూపిలో ఓటర్ కార్డు ఉంటూ, ఆంధ్రా పై విషం చిమ్మే బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, మళ్ళీ పెలాడు. నిజానికి రెండు రోజుల క్రితమే ఈయన ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉన్నా, మొన్న శుక్రవారం నాడు కార్ తో, ఇద్దరిని గుద్ది, ఒకరిని చంపేసిన సంగతి తెలిసిందే. గాయాలు పాలైన మహిళను హాస్పిటల్ కి కూడా తీసుకువెళ్లకుండా, అక్కడ నుంచి పారిపోవటంతో, పెద్ద ఎత్తన విమర్శలు వచ్చాయి. జాతీయ స్థాయిలో కూడా, ఈ విషయం రచ్చ అవటంతో, రెండు రోజులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిన జీవీఎల్ , ఈ రోజు బయటకు వచ్చారు. వస్తూ వస్తూనే, చంద్రబాబుకి వార్నింగ్ ఇస్తున్నాడు జీవీఎల్.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో లాస్ట్‌లో ఉందన్నారు. అవినీతిలో మాత్రం నెంబర్ వన్‌లో ఉందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వానికి విలాసాల మీద ఉన్న ధ్యాస వికాసంపై లేదని దుయ్యబట్టారు. టీడీపీ ధర్మపోరాటం పేరుతో దొంగ పోరాటం చేస్తున్నారని వెక్కిరిస్తున్నారు. స్వప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థల అధిపతి మంత్రిగా ఉన్నారని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసన్నారు. అభివృద్ధి కోసం రుణాలు తేవడం తప్పుకాదన్నారు. కానీ ఏపీలో అలా జరగడం లేదని వ్యాఖ్యానించారు. నిధులను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వం రుణాలు తీసుకోవడమే పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. అందుకే ప్రభుత్వం లెక్కలు చెప్పేందుకు భయపడుతున్నారని విమర్శించారు. అమరావతిలో వెయ్యి ఖర్చు అయ్యే చోట పదివేలు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా నిధులను పార్టీ ఫండ్‌లోకి మళ్లిస్తున్నారనే అనుమానం ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసే ప్రతి పని పైనా జాతీయ స్థాయిలో నిఘా ఉంటుందని జీవీఎల్ చెప్పుకొచ్చారు. అయితే వీటి అన్నిటి పై, ఎప్పటికప్పుడు కుటుంబరావు లెఫ్ట్ అండ్ రైట్ వాయించినా, ఈ జీవీఎల్ మాత్రం తుడుచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కుటుంబరావు గారు వాయించాగానే, ఆ టాపిక్ వదిలేసి, మళ్ళీ వేరే టాపిక్ తో వచ్చి, ఆరోపణలు చేసి పారిపోతారు. మొన్న ఆక్సిడెంట్ చేసి ఎలా హిట్ అండ్ రన్ చేసారో, ఇక్కడ కూడా ఆరోపణలు చెయ్యటం, పారిపోవటం, ఈయనకు బాగా అలవాటు.