జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, విశాఖ ఫోకస్ గా వైసీపీ నేతలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అక్కడ విజయసాయి రెడ్డిని ప్రత్యేకంగా నియమించటంతో, ఆయన ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. అనధికార ముఖ్యమంత్రి అనే పేరు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విజయసాయి రెడ్డికి ఉంది. విజయసాయి రెడ్డి ఒక్కడే కాదు, అక్కడ ఉన్న వైసీపీ ప్రధమ, ద్వితీయ స్థాయి నేతలు కూడా అలాగే ఉన్నారు. ఇక దీనికి తోడుగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రభుత్వం ప్రకటించటం, అదిగో వచ్చేస్తున్నాడు, ఇదిగో వచ్చేస్తున్నాడు అంటూ, వైసీపీ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఇక్కడ భూకబ్జాల ఆరోపణలు అయితే చెప్పే పనే లేదు. విజయసాయి రెడ్డి పై అనేక ఆరోపణలు రావటంతో, ఆయన నాకు ఏమి సంబంధం లేదు అని చెప్పే పరిస్థితి వరకు వచ్చింది. వైసీపీ నేతల స్పీడ్ ఎక్కడి వరకు వెళ్లి అంది అంటే, అధికారుల మాటలను ధిక్కరించే వరకు వెళ్లి, వైజాగ్ లో ఇష్టారాజ్యంగా చేసేస్తున్నారు. ముఖ్యంగా జీవీఎంసీ కమిషనర్ సృజనతో వైసిపీ నేతలు లడాయి పెట్టుకుంటున్నారు. ఆమె పై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. తమ పనులు చేయకపోవటమే కాకుండా, తమ పనులకు కూడా అడ్డు పడుతున్నారు అంటూ వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే, విశాఖలో కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లు, తమంతట తాముగా అధికారులతో సమీక్షలు జరిపే వరకు వెళ్ళింది. దీంతో సమయం వృద్ధా అవుతూ ఉండటంతో, అధికారులు ఇలాంటి సమావేశాల్లో పల్గున కూడదు అంటూ ఆమె ఆదేశాలు జారీ చేసారు. దీంతో అందరూ కలిసి ఆమె పై విజయసాయి రెడ్డికి ఫిర్యాదు చేసారు. కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రి స్థాయిలో ఉన్న వారు కూడా, జీవీఎంసీ కమిషనర్ సృజన పై అసంతృప్తిలో ఉంటూ, ఆమెను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేపించే ప్రయత్నంలో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపధ్యంలోనే జీవీఎంసీ కమిషనర్ సృజన చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతుంది. ధీరులు అనే వారు ధర్మంగా ఉండాలని, వీరులుగా ఉండే వారు పని చేయాలని, ఎప్పుడైనా తలఎత్తుకుని ఉండాలని, భయపడకుండా మన పని కోసం ధైర్యంగా నిలబడి, ధర్మాన్ని కాపాడే విధంగా తనకు శక్తిని ఇచ్చిన దేవుడుకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసారు. అయితే ఈ ట్వీట్ ఆమె ఏ ఉద్దేశంతో పెట్టినా, విశాఖలో మాత్రం చర్చనీయంసం అయ్యాయి.