చెప్పినట్టుగానే అగ్రిగోల్డ్ భాదితులకి న్యాయం చేస్తున్నారు చంద్రబాబు. జనాల నెత్తిన టోపీ పెట్టి మూసేసిన చిట్ ఫండ్ కంపనీ నుంచి, ఆస్తులు రికవర్ చేసి, వేలం వేసి, డబ్బులు రికవరీ చేసి, బాధితులకి తిరిగి డబ్బులు ఇవ్వనుంది చంద్రబాబు ప్రభుత్వం. విశాఖపట్నంలో, విఆర్ చిట్స్ బాధితులను ఆదుకున్న తరువాత నుంచి, అగ్రి గోల్డ్ బాధితులు కూడా, కొండ అంత అండతో, చంద్రబాబు మమ్మల్ని ఆదుకుంటారు అనే నమ్మకంతో ఉన్నారు. అయితే అనేక కారణాలతో, విషయం కోర్ట్ లో ఉండటంతో, లేట్ అవుతూ వస్తుంది. అయితే, ఇప్పుడు వీరి బాధలు తీరనున్నాయి. ఒక పక్క ప్రతిపక్షాలు, అగ్రిగోల్ద్ బాధితుల్ని రెచ్చగొడుతూ పనులు చేస్తున్నా, చంద్రబాబు మాత్రం, ఇవేమీ పట్టించుకోకుండా, బాధితులకు న్యాయం చేస్తున్నారు.
అగ్రిగోల్డ్ వ్యవహారంపై ఈరోజు హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. హాయ్‌లాండ్‌ను వేలం వేయడానికి రంగం సిద్ధమైంది. హాయ్‌లాండ్ కనీస ధర రూ.600 కోట్లుగా ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసింది. హాయ్‌లాండ్ విలువ ఎంత ఉంటుందనే దానిపై ప్రభుత్వం, సీఐడీ, ఎస్‌బీఐలు ధరను న్యాయస్థానానికి సమర్పించాయి. అనంతరం హాయ్‌లాండ్‌ను వేలం వేయాలని ఎస్‌బీఐని హైకోర్టు ఆదేశించింది. హాయ్‌లాండ్‌లో కొంతభాగం గతంలోనే ఎస్‌బీఐ వద్ద తనఖా పెట్టినందున.. ఆ ఆస్తిని పూర్తిగా వేలం వేసిన తర్వాత ఎస్‌బీఐకి ఎంత ఇవ్వాలి.. అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ఎంత ఇవ్వాలి అనే విషయాలను ఖరారు చేస్తామని హైకోర్టు పేర్కొంది.
ఆస్తుల వేలంపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, బిడ్డర్ల వివరాలను ఫిబ్రవరి 8లోపు సీల్డ్‌కవర్‌లో సమర్పించాలని ఎస్‌బీఐకి సూచించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుపై తొలుత ముందుకొచ్చిన జీఎస్‌ఎల్ గ్రూపు ఆ తర్వాత వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో జీఎస్‌ఎల్ ప్రతిపాదన ఉపసంహరణకు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. హైకోర్టు సమయాన్ని వృథా చేసినందున జీఎస్‌ఎల్‌కు రూ.3కోట్ల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.