ఒకటి కాదు.. పది కాదు.. దాదాపు 30ఏళ్లకు పైగా నిరీక్షిస్తున్న చిత్తూరు జిల్లా కరువు రైతు కల సాకారమయ్యింది. గలగలా పారుతూ కరవు సీమ చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాన్ని కృష్ణాజలాలు ముద్దాడాయి. సోమవారం ఉదయం జిల్లాలోకి ప్రవేశించాయి. చిరకాల స్వల్పం నెరవేరింది. అనంతపురం జిల్లా కదిరి శివారులోని చెర్లోపల్లి జలాశయం నుంచి పుంగనూరు బ్రాంచి కెనాల్‌కు మూడు రోజుల క్రితం 150 క్యూసెక్కుల నీటిని ప్రయోగాత్మకంగా వదిలారు. ఇవి ఆదివారం అర్ధరాత్రి చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోకి చేరాయి. ఇక్కడి నుంచి మరి కొన్ని రోజుల్లో ముఖ్యమంత్రి నియోజవర్గం కుప్పానికి కృష్ణాజలాలు చేరుకోనున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ కృష్ణాజలాలు అనంతపురం జిల్లా జిడిపల్లి వద్ద గల జలాశయం నుంచి 22 కిలోమీటర్లు ప్రయాణించి ఇదే జిల్లాలోని కదిరి వద్ద గల చెర్లోపల్లి రిజర్వాయర్‌ చేరుతూ వచ్చాయి. ఇది 1.425 టిఎంసిల సామర్థ్యం కలదు. ఇందులో 30 శాతం నీళ్లు నిండిన తరువాత మూడు రోజుల క్రితం 150 క్యూసెక్కుల నీటిని కిందికి వదలారు.

handriniva 21012019

పరిశ్రమలశాఖ మంత్రి కె.అమరనాథరెడ్డి అక్కడ ఆ జలాలకు స్వాగతం పలికారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టిసీమ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ముందుచూపుతో పూర్తిచేయడం వల్లనే కృష్ణాజలాలను రాయలసీమకు తరలించగలుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను అనుసంధానిస్తామని స్పష్టం చేశారు. గాలేరు- నగిరిలో భాగమైన గండికోట ప్రాజెక్టు నుంచి కృష్ణాజలాలను అనంతపురం జిల్లా కదిరి వద్ద హంద్రీ-నీవా కాలువలోకి మళ్లించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. తద్వారా పంపింగ్‌ తగ్గిపోయి సులభంగా, నేరుగా చిత్తూరు జిల్లాలోకి నీళ్లు చేరుతాయని ఆయన వివరించారు.

handriniva 21012019

కర్నూలు జిల్లాలోని హంద్రీ నది నుంచి.. చిత్తూరు జిల్లాలోని నీవా నదిని అనుసంధానించాలన్న బృహత్‌ సంకల్పంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టు అనేక అవరోధాలను అధిగమిస్తూ.. తుది దశకు చేరుకుంటోంది. చెర్లోపల్లి నుంచి శుక్రవారం ప్రయోగాత్మకంగా నీటిని వదలడంతో.. అవి చిత్తూరు జిల్లాకు చేరాయి. అనంతపురం జిల్లా జీడిపల్లి వద్ద 1.6 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించిన జలాశయం ప్రస్తుతం పూర్తిగా నిండింది. ఇక్కడి నుంచి మొదలయ్యే ప్రధాన కాలువ కదిరి మండలం పట్నం గ్రామం నుంచి పుంగనూరు బ్రాంచి కెనాల్‌గా మారుతుంది. ఇది 22 కిలోమీటర్లు ప్రవహించి కదిరి సమీపంలోని చెర్లోపల్లి జలాశయానికి చేరుతుంది. ఈ మార్గంలో 8 మంది లిప్టుల ద్వారా నీటిని నిరంతరాయంగా తోడుతున్నారు. చెర్లోపల్లి పూర్తి సామర్థ్యం 1.425 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 0.6 టీఎంసీల నీరు చేరింది. పక్షం రోజుల క్రితమే ఇక్కడి నుంచి దిగువకు నీటిని వదలాలని జలవనరుల శాఖ నిర్ణయించినా.. అనుకోని అవరోధాలతో ఆగిపోయింది. అనంతపురం జిల్లాలో పలుచోట్ల ప్రధాన కాల్వలకు గండ్లు కొట్టడంతో ప్రవాహం తగ్గిపోయింది. తాజాగా ఆ మరమ్మతులన్నీ పూర్తిచేసి.. పై నుంచి సరఫరా పెంచడంతో పుంగనూరు బ్రాంచికి జలకళ వచ్చింది. మరోపక్క, చెర్లోపల్లి నుంచి చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోని పీటీఎం వరకు 26వ ప్యాకేజీ కింద పనులు పూర్తయ్యాయి. ట్రయల్‌ రన్‌గా సుమారు 150 క్యూసెక్కుల నీటిని రెండు రోజుల క్రితమే వదిలారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో విడుదల చేస్తారు. ఈ ప్రాంతాల్లో 1.80 లక్షల ఎకరాలకు సాగుకు, 10 లక్షల మందికి తాగునీరు లభించే అవకాశం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read