అదో బృహత్తర ప్రాజెక్టు. సీమను సస్యశ్యామలం చేసి నాలుగు జిల్లాల ప్రజల దాహర్తిని తీర్చేందుకు ఉద్దేశించిన పథకం. 33 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకుంది ఈ ప్రాజెక్టే హంద్రీనీవా. కర్నూల్ జిల్లాలోని ముచ్చమర్రి గ్రామం వద్ద హంద్రీ నీవా సుజల స్రవంతి మొదటి దశ రెండవ ప్యాకేజీలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం జాతికి ఆంకితం చేయనున్నారు.
దీనివల్ల రాయలసీమలోని కర్నూల్, కడప, చిత్తూరు, అనంతపూర్ జిల్లాల్లోని 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల ప్రజలకు మంచినీరు అందుతుంది. ముచ్చుమర్రి నుంచి హంద్రీ-నీవా కాల్వకు 4 పంపుల ద్వారా 1320 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 3 పంపుల నుంచి 750 క్యూసెక్కులు శుక్రవారం నుంచి ఎత్తిపోయనున్నారు.
రాయలసీమకు పట్టిసీమగా భావించే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని రూ.326 కోట్లతో చేపట్టారు. శ్రీశైలం జలాశయం 790 అడుగుల మట్టం నుంచి నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. అప్రోచ్ కెనాల్ నిర్మాణం పూర్తికాకపోవడంతో 809 అడుగుల వద్ద నీటిని తీసుకోవలసి ఉంటుంది. కేసీ కాల్వకు 4 పంపుల ద్వారా 1,000 క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 12 పంపుల ద్వారా 3,960 క్యూసెక్కులు తీసుకుంటారు..
మేఘా సంస్థ ప్రభుత్వం ఇచ్చిన ఎత్తిపోతలను సవాల్ గా తీసుకుని నిర్దేశించిన గడువుకన్నా ముందే పూర్తిచేసి రికారుల్లోకి ఎక్కింది.