వైసీపీ పార్టీ అంటేనే, దానికి ఒక బ్రాండ్ ఉంది.. విధ్వంసం చెయ్యటమే ఆ పార్టీ పని. గన్నవరం నియోజకవర్గంలో, ఎమ్మల్యే వంశీని ఎదుర్కునే దమ్ము లేక, అక్కడ ఉన్న వైసిపీ నేత దుట్టా రామచంద్ర రావు చేతులు ఎత్తేస్తే, ఎక్కడ నుంచో యార్లగడ్డ వెంకట్రావు అనే వ్యక్తిని ఇంపోర్ట్ చేసాడు జగన్. ఇతని దగ్గర డబ్బులు బాగా ఉండటంతో, ఆ డబ్బు మదంతో, అందరినీ కొట్టటం, ప్రతి ఊరిలో గొడవ పెట్టటం, పనిగా పెట్టుకున్నారు. అదే ఫ్లో లో, రచ్చబండ కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేత యార్లగడ వెంకట రావు బాపులపాడు మండలం కే.సీతారామపురం గ్రామంలోని, ఎస్సీ కాలనీలో పర్యటించారు. తొలుత కాలనీలో మేరీమాత విగ్రహానికి పూలదండ వేసి పర్యటన సాగించారు. అక్కడే బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలదండ వేయకుండా విస్మరించడం పై అవమానంగా భావించిన టీడీపీ కార్యకర్త గండేపూడి నితీష్ ఫేస్ బుక్‌లో ఇదేనా? దళిత జాతికి ఇచ్చే గౌరవం.. అంటూ పోస్టు పెట్టాడు.
దీని పై, నువ్వా నన్ను ప్రశ్నించేది అంటూ, అక్కడ ఉన్న తన అనుచరులని, ఉసుగొల్పాడు యార్లగడ వెంకట రావు. దీంతో మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. యార్లగడ్డ వెంకట్రావు మద్యంతో కూడిన విందును ఏర్పాటుచేసి వై.సి.పి కార్యకర్తలను ఉసిగొల్పడం వలన ఈ దాడి జరిగినది. తెలుగుదేశం కార్యకర్తలను మద్యం మత్తులో ఉన్న వై.సి.పి కార్యకర్తలు 150 మీటర్లు వరకు వెంటాడి చితకబాదారు. ఈ దాడుల్లో ఎస్సీ కాలనీకి చెందిన ఏడుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ నేతలు చలసాని ఆంజనేయులు, చెన్నుబోయిన శివయ్యల సహకారంతో హను మాన్ జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, పోలీసులు విచారణ చేసి, తగు సెక్షన్ ల క్రింద, ఇరు పార్టీ కార్యకర్తలని అరెస్ట్ చేసారు. అయితే, ఈ విషయం రాజకీయంగా వాడుకోవటానికి వైసిపీ నేత యార్లగడ్డ వెంకట్రావు, ఈ రోజు హనుమాన్‌జంక్షన్ పోలీస్ స్టేషన్ ఎదుట , కొంత మంది కూలీలను తీసుకువచ్చి గోల గోల చేసారు. ఉదయం నుంచి హనుమాన్‌జంక్షన్ పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పోలీసులు ఎంత చెప్పిన వినిపించుకోలేదు. ఈ సందర్భంగా పోలీసులపై దుర్భాషలాడారు. చేతకాని పోలీసులు అంటూ దూషించారు. మా కార్యకర్తల పై పెట్టిన కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు ఎత్తివేయాలి అని హడావిడి చేసారు. పోలీసులు మాత్రం, చట్ట ప్రకారం మేము చెయ్యాల్సిందే చేస్తున్నామని చెప్పిన వినిపించుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోయి జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. మేము కొడతాం, కొట్టించుకోవాలి, మా మీదే కేసులు పెడతారా అంటూ, మద్యం మత్తులో ఊగిపోతున్నారు. పోలీసులు రంగంలోకి దిగటంతో తోక ముడిచారు.