నందమూరి హరికృష్ణ అంతిమయాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. నందమూరి హరికృష్ణ పార్థివదేహం హైదరాబాద్, మెహిదీపట్నంలోని ఆయన ఇంటికి చేరుకుంది. నల్గొండ జిల్లా అన్నెపర్తి హాస్పిటల్ లో పోస్ట్ మార్టం నిర్వహించి, అక్కడ నుంచి ఆయన భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ లోని ఆయన ఇంటికి తరలించారు. హరికృష్ణ అంత్యక్రియలు మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో హరికృష్ణ అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణా చీఫ్ సెక్రటరీ జోషికి, తెలంగాణా సీఎం కేసీఆర్ ఈ ఆదేశాలు ఇచ్చారు. అయితే హరికృష్ణ అంతిమయాత్ర, ఆయనకు ఎంతో ఇష్టమైన చైతన్య రథం పై నిర్వహించాలని ఆయన కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. హరికృష్ణ అంతిమయాత్ర ఆయనకు ఎంతో ఇష్టమైన చైతన్యరథం పై జరుగనుంది. ఈ చైతన్యరథానికి, ఎన్టీఆర్ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. 1982లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి, ఆయన తన ఎన్నికల ప్రచారం కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి చైతన్యరథంగా నామకరణం చేశారు. ఈ వాహనం పై, దాదాపు ఓ ఏడాది పాటు ఏపీ అంతా కలియతిరిగారు. ఈ వాహనాన్ని హరికృష్ణే స్వయంగా నడిపారు.