మాజీమంత్రి హరిరామజోగయ్య వైసీపీ కోసం పనిచేస్తున్నాడా? ముద్రగడ పద్మనాభం మాదిరిగానే కాపు కార్డుతో పవన్ కళ్యాణ్‌కి హాని చేస్తూ..వైసీపీకి మేలు చేసేలా వ్యవహరిస్తున్నాడా? ఈ అనుమానాలు ఆయన మాటలని బట్టి వస్తున్నాయి. జనసేనానిని ముంచేయడానికి జోగయ్య కంకణం కట్టుకున్నారని, పవన్ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటాడా, లేక జోగయ్య బుట్టలో పడతాడా ? అనేది ఇప్పుడు రాజకీయ సమీకరణాలని మలుపు తిప్పే అంశం కానుంది. జగన్ రెడ్డిని సాగనంపాలంటే పవన్ కళ్యాణ్ ను సీఎం చేసేందుకు బాబు ఒప్పుకోక తప్పదని మాజీ మంత్రి హరిరామజోగయ్య ప్రకటించి కలకలం రేపారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని సూచించిన జోగయ్య చేసిన వ్యాఖ్యలన్నీ పవన్ కళ్యాన్‌కి మంచి చేసే కంటే, వైసీపీకి మేలు చేసేలా ఉన్నాయని విశ్లేషకుల మాట. జనసేనను బలహీనం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని, కన్నా లక్ష్మీనారాయణ, మహాసేన రాజేష్ లను జనసేనలో చేరకుండా టిడిపి అడ్డుకుందని ఆరోపించారు. సోషల్ మీడియాలోనూ జనసేన లక్ష్యంగా చేసుకుని టిడిపి ప్రచారం చేస్తోందనడం ఆయనకి టిడిపిపై అక్కసే తప్పించి వాస్తవాలు తెలియవని తేలిపోయింది. క్షేత్రస్థాయిలో కనీస అవగాహన లేకుండా వైసీపీ చేసే ఫేక్ ప్రచారాన్ని బేస్ చేసుకుని చేగొండి మాట్లాడుతున్న మాటలని పవన్ పరిగణనలోకి తీసుకుంటాడా? అనేది అనుమానమే.
హరిరామజోగయ్య, పవన్ ని ముంచేస్తాడా ?
Advertisements