బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. అయితే, ఈయన్ను తప్పించటానికి దాదాపు నెల రోజులు నుంచి బీజేపీలోని ఒక వర్గం భారీ స్కెచ్ వేసినట్టు హరిబాబు వర్గీయులు చెప్తున్నారు.. రాష్ట్రానికి సంబందించిన ఒక వ్యక్తి, జాతీయ స్థాయిలో బీజేపీలో ఎంతో కీలకంగా ఉంటున్నాడు.. అతని ఆదేశాలు మేరకే, ఈ ఆపరేషన్ జరిగిందని, హరిబాబు పై అనుమానాలు సృష్టించి, అవమానాలు పాలు చేసి బయటకు పంపించే ప్లాన్ తెలుసుకునే, హరిబాబు మనస్థాపం చెంది, రాజీనామా చేసినట్టు ఆయన వర్గీయలు చెప్తున్నారు.. హరిబాబు ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేసేవారు కాదని, సబ్జెక్టు పైనే విమర్శలు చేసే వారని, అంత హుందాతనం ఉన్న వ్యక్తులు, ఈ రోజు బీజేపీ పార్టీకి పనికి రావట్లేదు అని,బూతులు తిట్టే వారిని ప్రోత్సహించటం కోసం, హరిబాబుని బాలి పశువుని చెయ్యాలనుకున్నా, ఆయన ఎంతో హుందాగా స్పందిస్తూ, యువకులకు అవకాసం ఇవ్వటం కోసమే రాజీనామా చేసానని చెప్పారని, ఆయన వర్గీయులు అంటున్నారు..
కేంద్ర మంత్రి వర్గంలో చోటు అనేది, ఉత్తుత్తి మాటలు అని, పోయినసారి మంత్రి పదవి ఇస్తున్నాం రమ్మని చెప్తే, ఫ్యామిలీతో సహా ఢిల్లీకి వెళ్తే, చివరి నిమిషంలో వేరే వారికి ఇచ్చి, అవమానించారని గుర్తు చేస్తున్నారు.. ‘కేంద్రం రాష్ట్రానికి ఏమేం చేసిందో వివరించండి’ అని చెప్పిందే చెప్పడం మినహా రాష్ట్రానికి సాంత్వన చేకూర్చే ప్రకటనేదీ చేయలేదు. విశాఖకు రైల్వే జోన్ తీసుకొచ్చి తీరతానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చి ఎంపీగా నెగ్గిన హరిబాబు.. ఆ విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడంతో లోలోపల మధనపడుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజల్లోకి వెళ్లలేని నిస్సహాయత.. వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన... పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడమే ఉత్తమమని భావించినట్లు తెలుస్తోంది.
అయితే కొత్త అధ్యక్షుడి పై కూడా బీజేపీ పెద్ద కసరత్తే చేస్తుంది... 15 రోజుల క్రితం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రామ్‌మాధవ్, రాంలాల్‌తో పాటు మరికొంత మంది ముఖ్యనేతలను మాణిక్యాలరావు కలిశారు. ప్రత్యర్థి పార్టీలు, ప్రజా సంఘాలపై ఎదురుదాడి చేసే నాయకుడికే రాష్ట్ర పగ్గాలు అప్పగించే అవకాశం ఎక్కువగా ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన ఏపీలో అధికార పక్షం(కమ్మ), ప్రతిపక్షం(రెడ్డి), కొత్తగా వచ్చిన మూడో పక్షం(కాపు)పైనా కుల ముద్ర ఉంది. పార్టీలో రాష్ట్ర అధ్యక్ష పదవిని ఒక కులానికి చెందినవారికే ఇవ్వాలని కొంత కాలంగా చేస్తున్న వాదన కొందరికి మింగుడుపడడంలేదు. మాణిక్యాలరావు, వీర్రాజుల్లో ఒకరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీమకు ఈసారి కూడా అవకాశం దక్కనట్లే