కంభంపాటి హరిబాబు... ఈ పేరు ఎవరికన్నా తెలుసా ? మొఖం చూస్తే, పది మందిలో ఒకరు గుర్తుపడతారు.. ఈ మహానుభావుడు వైజాగ్ ఎంపీ... పక్కంటి వారికి కూడా తెలియని ఈయన, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని, విజయమ్మ మీద ఎంపీగా గెలిచారు. విజయమ్మ గెలిస్తే వైజాగ్ నాశనం అవుతుంది అని, ఈయన్ను ఎన్నుకున్నారు ప్రజలు. ఈ రోజు పార్లమెంట్ లో కంభంపాటి హరిబాబు చేసిన ప్రసంగం, ప్రతి ఆంధ్రుడు గుండెల్లో గునపం గుచ్చేలా ఉంది. తమ ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవటానికి, మా మోడీ అన్నీ చేసాడు, ఆంధ్రప్రదేశ్ కు అన్నీ చేసేసాం, తెలుగుదేశం మోసం చేసింది అంటూ, ఢిల్లీ బాసులకి జై కొట్టి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో చరిత్ర హీనుడుగా మిగిలిపోయారు. అప్పట్లో సమైఖ్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, ప్రజల మనోభావాలకు తగ్గట్టు ప్రవర్తించి, సోనియా గాంధీకి ఎదురు తిరిగారు.
ఇక్కడ మాత్రం, ఈ బీజేపీ ఏపి ఎంపీ, తమ ఢిల్లీ బాసులకు జై కొట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డాడు. తన సొంత ఊరు వైజాగ్ లో, రైల్వే జోన్ తెచ్చుకోలేని ఈ దద్దమ్మ ఎంపీ, ఎదురు ఆంధ్రప్రదేశ్ పై పడి, ఐదు కోట్ల మంది ప్రజల గుండెల్లో కొట్టారు. ఆ రోజు బిల్ పెట్టిన కాంగ్రెస్ తప్పు అంటూ, ప్రత్యేక హోదా అంశం ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. మరి అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ, ప్రత్యేక హోదా చట్టంలో పెడితేనే తెలంగాణా బిల్ కు మద్దతు ఇస్తాం అని ఎందుకు చెప్పలేదు ? సుష్మా స్వరాజ్ వచ్చి, నేను మీ చిన్నమ్మని, సోనియా పెద్దమ్మ, మేమే తెలంగాణా ఇచ్చాం అని చెప్పుకున్న బీజేపీకి, బిల్ రూపొందించినప్పుడు ఎక్కడ నిద్రపోయారు ?
పోలవరంపై మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముందుకు తీసుకువెళ్లారని, నితిన్ గడ్కరి ప్రత్యేకంగా ప్రాజెక్టు పనులు సమీక్షించి సంపూర్ణ సహకారానికి భరోసా ఇచ్చారని చెప్పారు. పోలవంరం మీరు పూర్తి చేయకున్నా మేము పూర్తి చేస్తామని, ఆ సామర్థ్యం మాకు ఉందని అన్నారు. అలాగే మోదీ చొరవతో ఏపీకి రావాల్సిన 11 యూనివర్శిటీలో 10 యూనివర్శిటీల కేటాయింపు జరిగిపోయిందని, మిగిలిన గిరిజన యూనివర్శిటీకి జవదేకర్ వచ్చేలా చూస్తారని హరిబాబు అన్నారు. ఈ యూనివర్శిటీలకు ఇచ్చిన నిధులు మాత్రం హరిబాబు మర్చిపోయారు. ఇలా అన్ని విధాలుగా, ఏపికి అండగా నిలవకుండా, తమ ఢిల్లీ బాసులకి అండగా నిలిచి, హరిబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోయాడు.