గ్రామీణాభివృద్ధి పై అధ్యయనం చేసి గ్రామసీమల సర్వతోముఖాభివృద్ధికి కేంద్రప్రభుత్వం హైదరాబాద్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయితీరాజ్, కార్యక్రమం ఏర్పాటు చేసింది. గ్రామసీమల్లో నూతన ఆవిష్కరణల ద్వారా జరుగుతున్న అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించడం వంటి అంశాలపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఈ సంస్థల్లో శిక్షణ ఇస్తారు. హైదరాబాద్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో గ్రామసీమల్లో నూతన ఆవిష్కరణల ద్వారా అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాలుగు రోజుల పాటు ఈ వర్క్ షాపు జరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 40 మంది ఎమ్మెల్యేలు, మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, పంచాయితీ‌రాజ్ గ్రామీణాభివృద్ధిశాఖలో పనిచేసే అధికారులను ఆహ్వానించారు.

manikyalarao 25122018

ఈ వర్క్‌షాప్‌కు ఏపీ నుంచి కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఒక్కరే హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఆదర్శ గ్రామమైన సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్‌కి ఎమ్మెల్యేలను తీసుకువెళ్లారు. సిద్దిపేట హరీశ్‌రావు నియోజకవర్గం. ఇబ్రహీంపూర్‌లో వినూత్న అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. భూగర్భ డ్రైనేజ్, ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు, సోలార్ పవర్, ఎల్ఈడీ బల్బులు, గొర్రెలు, గేదెలకు గ్రామం వెలుపల షెడ్ల నిర్మాణం, గ్రామం మొత్తం రహదారులు, ప్లాస్టిక్ వాడకంపై నిషేధం, పరిశుభ్రత, ఇంటింటికీ కుళాయి వంటివి ఏర్పాటుచేశారు. ఎన్‌ఐఆర్‌డీ నుంచి వెళ్లిన బృందానికి మాజీమంత్రి హరీశ్‌రావు స్వాగతం పలికారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించారు. వందశాతం అక్షరాస్యత సాధించిన గ్రామం ఇబ్రహీంపూర్.

 

manikyalarao 25122018

ఇక ఆవుల కోసం కూడా ఊరి బయటే షెడ్లు వేశామని చెప్పగా, ఈ వర్క్‌షాప్‌కు వెళ్లిన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తమ నియోజకవర్గంలో కూడా పశువులకు ఇటువంటి ఏర్పాట్లు చేశామనీ, వాటికి గోకులాలు అని పేరు పెట్టామనీ వివరించారు. రాష్ట్రమంతా ఈ కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని, పశువుల కోసం, గోకులం పేరుతో, షెడ్లు కడుతున్నామని చెప్పారు. దీంతో చంద్రబాబు మంచి పేర్లు పెడతారని హరీశ్ కితాబునిచ్చారు. ఇక ఇబ్రహీంపూర్‌ గ్రామ సమగ్రాభివృద్ధిని చూసి పెనమలూరు ఎమ్మల్యే హరీష్ రావుని మెచ్చుకున్నారు. రాజకీయ ప్రత్యర్దులమైనా, చేసిన మంచిని తెలుసుకోవటం మంచిదని అన్నారు. అదే సమయంలో తన నియోజకవర్గంలో పలు గ్రామాలు ఎంతో ప్రగతి సాధించాయని గుర్తుచేశారట. అసలు అలాంటి గ్రామాలు తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పారట. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి కారణం వల్లనే ఏపీలో పల్లెసీమలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని చంద్రబాబు చేసిన పనులన్నీ, ఎమ్మెల్యే వివరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read