నిన్నటి నుంచి టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తుంది. అది కూడా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ. నిన్న లగడపాటి రాజగోపాల్ తిరుపతి దర్శనానికి వెళ్లి బయటకు రాగానే మీడియా చుట్టుముట్టింది. తెలంగాణా విషయం అడగగా, నేను ఇప్పుడే చెప్పను అని చెప్పారు, కాని బలవంతంగా వాళ్ళు అడగగా, లగడపాటి మాట్లాడుతూ, ఈ సారి ఒక 8 మంది వరకు ఇండిపెండెంట్లు గెలుస్తారు అంటూ చెప్పారు. ప్రతి రోజు కేసీఆర్ నేను వంద సీట్లు గెలుస్తా అని ఎలా చెప్పారో, అలాగే లగడపాటి కూడా చెప్పారు. నేను సర్వే చేసాను, ఇది దాని రిజల్ట్ అని చెప్పలేదు. నా అభిప్రాయం ఇది అంటూ, అందరూ చెప్పినట్టే చెప్పారు. ఇక్కడే తెరాస వాళ్ళు సెల్ఫ్ గోల్స్ వెయ్యటం మొదలు పెట్టారు.
రెండు నెలల క్రితం లగడపాటి సర్వేలో తెరాస గెలుస్తుంది అంటే చంకలు గుద్దుకున్న కేసీఆర్, నిన్నటి నుంచి మాత్రం లగడపాటి పై మండి పడుతున్నారు. నిజానికి లగడపాటి తెరాస ఓడిపోతుంది అని ఎక్కడా చెప్పలేదు. కాని కేసీఆర్ నిన్న బహిరంగ సభలో, ఆడెవడో సన్నాసి సర్వే అంటూ వస్తున్నాడు అంటూ, తిట్ల దండకం అందుకున్నాడు. ఈ రోజు తెరాస వాళ్ళు, లగడపాటి పై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసారు. వారం రోజుల్లో జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేసేలా లగడపాటి వ్యాఖ్యలు ఉన్నాయని టీఆర్ఎస్ ఎన్నికల సమన్వయ కమిటీ తరపున దండె విఠల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా వ్యాఖ్యలు చేయడం ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని, ఈ వ్యాఖ్యలను టీవీల్లో ప్రసారం చేశారని అన్నారు. అయితే ఇది సర్వే కాదు, తన అభిప్రాయం ఆయన చెప్పారు. అలాగైతే, వంద సీట్లు గెలుస్తాం అంటున్న కేసీఆర్ పైన కూడా చర్యలు తీసుకోవాలి కదా ?
మరో పక్క, తెలంగాణ ఎన్నికల్లో పది మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధిస్తారని ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. లగడపాటి.. చంద్రబాబుకు సీక్రెట్ ఏజెంటా ఏంటీ? అని ప్రశ్నించారు. చంద్రబాబు, లగడపాటి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. అసలు లగడపాటి తిరుపతిలో ఇండిపెండెంట్లు 8 మంది గెలుస్తారు అని చెప్తే, దానికి హరీష్ రావుకు భయం ఎందుకు ? ఈ మాత్రం దానికే లగడపాటి, చంద్రబాబు సీక్రెట్ ఏజెంట్ అయిపోతాడా ? మరో పక్క కేటీఆర్, చంద్రబాబు అంతు చూస్తున్నాం అంటాడు. అసలు ఇంత చిన్న విషయం పట్టుకుని నిన్నటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఎందుకు ఇలా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ, వాళ్ళ బలహీనత వాళ్ళే బయట పెట్టుకుంటారు ? ఒక్క లగడపాటి కోసం, ఫ్యామిలీ ఫ్యామిలీ నిన్నటి నుంచి ఇంతలా టెన్షన్ పడుతుంది.