మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే, ఇది వరకు ఎంతో గర్వంగా చెప్పుకునే వారు. ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్, విదేశీ పెట్టుబడులో నెంబర్ వన్, ఆక్వా ఎగుమతుల్లో నెంబర్ వన్, నదులు అనుసంధానంలో నెంబర్ వన్, రియల్ టైం గవర్నన్స్, వేగంగా పూర్తీ అవుతున్న పోలవరం జాతీయ ప్రాజెక్ట్, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం, ఇలా అన్ని విషయాల పై దేశంలోని రాష్ట్రాలే కాదు, ప్రపంచంలో వివిధ దేశాలు కూడా మనల్ని పొగడటం చూసాం. అలాగే పక్క రాష్ట్రాలతో పోటీ తట్టుకుని మరీ, మనం పెట్టుబడులు ఆకర్షించాం. అలాగే మనలను కించ పరుస్తూ, మనల్ను తక్కువ చేసి మాట్లాడుతున్న తెలంగణా రాష్ట్రానికి కూడా, మనం పనితనంతోనే సమాధానం చెప్పాం. అయితే, మారిన రాజకీయ పరిస్థితిలో, ప్రభుత్వం మారింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆయన నవరత్నాలకే ప్రాధాన్యత ఇవ్వటంతో, పెట్టుబడులు రావటం లేదు, ఆదాయం లేదు, గ్రోత్ తగ్గిపోయింది, పీపీఏ లాంటి విషయంలో దేశంలో పరువు పోయింది.

harish 29122019 2

ఇలా అనేక నిర్ణయాలతో దేశంలో చులకన అయ్యాము. ఇప్పుడు మూడు రాజధానుల నిర్ణయంతో, మరో అనిశ్చితి పరిస్తితి ఏర్పడింది. ఇప్పటికే పెట్టుబడులు లేక, ఆదాయం తగ్గిపోతుంటే, ప్రధాన ఆదాయ వనరు అయిన రియల్ ఎస్టేట్ కూడా డమాల్ మంటుంది. ముఖ్యంగా అమరావతిని అన్యాయం జరుగుతూ ఉండటంతో, ఇక్కడ నుంచి అందరూ హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. దీంతో హైదరాబాద్ దిశ తిరిగింది. ఇక్కడ ఆశాజనిక వాతావరణం సరిగ్గా లేకపోవటంతో, అందరూ హైదరాబాద్ బాట పట్టారు. దీంతో దేశం అంతటా అన్ని నగరాలతో పోలిస్తే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దూసుకుపోతుంది. ఇదే విషయం నిన్న తెలంగాణాలో జరిగిన క్రెడాయ్‌ తెలంగాణ సమావేశంలో పాల్గుని, మంత్రి టి.హరీశ్‌రావు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

harish 29122019 3

దేశంలో రియల్ ఎస్టేట్ రంగం మందగమనంలో ఉంటే, హైదరాబాద్ లో మాత్రం పరుగులు పెడుతుందని, ఇది మన కేసీఆర్ నాయకత్వం అంటూ గొప్పగా చెప్పారు. ఇంతే కాదు, పక్క రాష్ట్రంలో జరుగుతున్న పనులు మీరు చూస్తున్నారు, ఇది కూడా మనకు చాలా అనుకూలం అయ్యింది అంటూ హరీష్ నవ్వుతూ చెప్పారు. ఆ నవ్వులోనే, మన రాష్ట్రాన్ని ఎంత హేళనగా చూస్తున్నారో అర్ధం అవుతుంది. పక్క రాష్ట్రాలకు ఆంధ్రల పరిస్థితి, నవ్వులాటగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో, మనలను హేళన చేసిన వారికి సమాధానం చెప్పాల్సిన ఆంధ్రులు, ఈ రోజు వారి చేతిలో మరోసారి హేళనకు గురి కావాల్సి వచ్చింది. మన చేతకాని పరిస్థితి, వారికి సానుకూలం అయ్యింది. మన ప్రభుత్వం, మనలను తల ఎత్తుకునేలా చెయ్యాలి కాని, ఇలా ఇతర రాష్ట్రాలు నవ్వేలా చేయ్యవద్దు అని కోరుకుందాం. ప్రభుత్వ పెద్దలు ఆంధ్రుల గురించి ఆలోచించాలి, ఆంధ్రులు అందరి ముందు తల ఎత్తుకునేలా చెయ్యాలి. తరువాత మనం మనం రాజకీయం చేసుకుందాం. ముందు మన రాష్ట్ర పరువు నిలబెట్టటం ముఖ్యం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read