తెలంగాణా మంత్రి హారీష్ రావు మరోసారి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. నాలుగు నెలల క్రితం, ఏపిలో రియల్ ఎస్టేట్ లేదు ఏమి లేదు, మొత్తం హైదరాబాద్ లోనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, కేంద్రం ఒత్తిడికి తలొగ్గి, రైతులకు మీటర్లు పెడుతున్న విషయం పై, సంచలన వ్యాఖ్యలు చేసారు. బావిల కాడ మీటర్లు పెడతాం అంటున్నారు, ఇది కరక్ట్ అంటారా అని కేంద్రాన్ని నిందిస్తూ ప్రశ్నించారు. మీకు ఇంకో ముచ్చట చెప్తాను అంటూ, కేంద్రం మనల్ని మీటర్లు పెట్టుకుంటే, రెండు వేల అయుదు వందల కోట్లు అప్పు ఇస్తాం అని చెప్పింది. బావిల కాడ, పొలాల్లో మోటార్లు పెడితే, రెండు వేల అయుదు వందల కోట్లు అప్పు ఇస్తాం అని ఆఫర్ ఇచ్చారని చెప్పారు. అన్ని రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల మీటింగ్ జరిగిందని, అందులో మాట్లాడుతూ మీకు రెండు వేల అయుదు వందల కోట్లు అప్పు కావాలి అంటే, రైతులకు మీటర్లు పెట్టాల్సిందే అన్నారు. మరి మీరు చెప్పండి మీటర్లు పెట్టమంటారా ? ఆ రెండు వేల అయుదు వందల కోట్లు అప్పు తెచ్చుకుందామా ? అంటూ ప్రజలను ప్రశ్నించారు. మనకు అదీ వద్దు, ఇదీ వద్దు అంటూ ప్రజలను ఉద్దేశించి హరీష్ చెప్పారు. అయితే ఇదే తరుణంలో జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.

మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో, జగన్ మోహన్ రెడ్డికి నాలుగు వేల కోట్లు ఆఫర్ ఇచ్చారని, ఆయాన వెంటనే ఆ డబ్బులు కోసం అని ఆశ పడి, రైతుల మేడలకు ఉరి తాడు వేసారని అన్నారు. ఆ నాలుగు వేల కోట్ల అప్పు కోసం, రైతులను ముంచేసారని హరీష్ రావు అన్నారు. మన తెలంగాణా రాష్ట్రం మాత్రం, రైతులకు మేలు చేసే విధంగా, మీ మీటర్లు వద్దు, మీ రెండు వేల అయిదు వందల కోట్లు వద్దు అంటూ, కేంద్రాన్ని తిరస్కరించారని హరీష్ అన్నారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే రైతులు బాగుపడుతున్నారు, ఇప్పుడు మీటర్లు అంటారు, రేపు చేతిలో బిల్లులు పెడతారు, అప్పుడు నష్టపోయేది రైతులే అని గ్రహించి, కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించామని, అక్కడ జగన్ మోహన్ రెడ్డి మాత్రం, నాలుగు వేల కోట్ల అప్పుకు ఆశ పడి, రైతులని ముంచేస్తున్నారని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read