రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, మాజీ ఎంపీ హర్ష కుమార్ వ్యాఖ్యానించారు. దళితులు ఓట్లు వల్లే, జగన్ గెలిచాడని అందరూ అనుకుంటుంటే, జగన్ తట్టుకోలేక పోతున్నాడని, దళితుల ఆధిపత్యం, ఎక్కువ అవుతుంది కాబట్టి, ఎక్కడికక్కడ అణిచివేయమని చెప్పటం వల్లే, దళితుల పై ఈ వరుస ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. దళితులను తోక్కటమే, ఎజెండాగా పెట్టుకున్నారని అన్నారు. దళితులు పేరు చెప్పుకుని అక్కడ ఉంటున్న ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, కనీసం సంస్కారం అనేది లేదని, అసలు వీళ్ళు దళితులేనా అనే అనుమానం వస్తుందని, హర్షకుమార్ అన్నారు. హోం మంత్రికి, అక్కడ ఉన్న ఎస్ఐ ఎవరో కూడా తెలియదు అని అన్నారు. ఈ 500 రోజుల్లో, దళితులకు ఒక్క లోన్ అన్నా ఇచ్చారా అని నిలదీశారు. ఇక సహించే ఓపిక లేదని, దళితుల పై ఇక నుంచి, ఒక్క అవమానకార సంఘటన జరిగినా, ఈ ప్రభుత్వాన్ని ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. "గుండు కొట్టిస్తార్రా మాకు మీరు. పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టిస్తారా" అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

శిరోముండనం కేసులో, శుక్రవారం సాయంత్రం లోపు, దాని వెనుక ఉన్న వారిని పట్టుకోవాలని అన్నారు. లేకపోతే శనివారం దీక్ష చేస్తానని అన్నారు. అంతే కాదని, ఈ దాడులు ఆగకపొతే, తాను త్వరలోనే రాష్ట్రపతిని కలిసి అన్నీ వివరిస్తానని, అయినా న్యాయం జరగపోతే, కనీవినీ ఎరుగుని రీతిలో, ఈ ప్రభుత్వం పై నిరసన దీక్ష చస్తాం అని, మేము చేసే నిరసన ఎలా ఉంటుందో, ఈ ప్రభుత్వం ఊహకు కూడా అందదని, దళితులు ఏమి చెయ్యలేం అనుకుంటున్నారు ఏమో, మీ వైఖరి ఇలాగే ఉంటె, ఏ చేత్తో అయితే ఎక్కించామో, అదే చేత్తో కూల్చేస్తాం అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తమ పోరాటానికి, అన్ని సంఘాలు, అన్ని రాజయకీయ పార్టీలు మద్దతు పలకాలని కోరారు. గ్యాంగ్ రేప్ ఘటన, మాస్కు లేదని చంపేసిన ఘటన, అలాగే శిరోమండనం ఘటన పై, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read