జగన్ మోహన్ రెడ్డి సడన్ గా విశాఖ పర్యటన పెట్టుకున్నారు. ఈ పర్యటన వెనుక ఉన్న మర్మం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఈ పర్యటనలో జగన్ మోహన్ రెడ్డి హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను కలవనున్నారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వారం రోజుల పర్యటన కోసం విశాఖ వచ్చారు. ఇక్కడ బేపార్క్ లో ఆయన నేచురోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సహజంగా రాష్ట్రానికి ఏ సియం అయినా వస్తే, ఇక్కడున్న సియం వద్దకు వచ్చి కలుస్తారు. కానీ మనకు మాత్రం రివర్స్ లో, ఆయన ఎక్కడో ఉంటే,మన ముఖ్యమంత్రి పని గట్టుకుని అక్కడకు వెళ్తున్నారు. ఇప్పటికే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ , స్వరూపందను కలిసారు. మూడు రోజుల క్రితం మంత్రి గుడివాడ అమర్నాద్ వెళ్లి కలిసారు. తరువాత జగన్ మోహన్ రెడ్డి కూడా ఆయన్ను వెళ్లి కలుస్తారని ప్రచారం జరిగింది. చివరకు ఈ రోజు జగన్ స్వయంగా విశాఖ వెళ్తున్నారు. అయితే ఈ భేటీ ఎందుకు జరుగుతుందో ఎవరికీ అంతు బట్టటం లేదు. హర్యానా రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఎలాంటి సంబంధాలు, ఇతరత్రా సమస్యలు లేవు. మరి జగన్ ఎందుకు కలుస్తున్నారు అంటే,మర్యాదపూర్వక భేటీ అంటున్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి ఇలా ఎవరో కోసం, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్లి కలిసిన సందర్భాలు ఏమి లేవు.
ఇప్పుడు ఈ భేటీ వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా అని చర్చ జరుగుతుంది. ముందుగా హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్వరూపానందను కలవటం, తరువాత జగన్ వెళ్లి కలవటం, ఇవన్నీ లింక్ చేస్తే, ఎదో జరుగుతుంది అనే విషయం స్పష్టం అవుతుంది. రాజకీయంగా బీజేపీ ఏమైనా చెప్పాలి అంటే, జగన్ ను నేరుగా ఢిల్లీ పిలిపించుకుని ఆదేశాలు ఇస్తారు, ఈయన పాటిస్తారు. మరి ఇక్కడ ఏమి జరుగుతుంది అనేది తెలియాలి. అయితే ఇక్కడ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్న బేపార్క్ విషయం కూడా గతంలో వార్తల్లో నిలిచింది. ఈ బేపార్క్ ని వైసీపీలోని కొంత మంది పెద్దలు కబ్జా చేసారు. ఇందులోనే జగన్ మోహన్ రెడ్డి సియాం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటారు అనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడే ఇదే బేపార్క్ కి జగన్ వస్తున్నారు. మధ్యానం విశాఖ వెళ్ళే జగన్ మోహన్ రెడ్డి, తిరిగి మళ్ళీ వెంటనే అమరావతి వచ్చేస్తారు. మరి ఈ సీక్రెట్ పర్యటన వెనుక అంతర్యం ఏమిటో మరి. చూడాలి.