ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రొసీడింగ్స్ ఇవ్వగా, ఎన్నికలు జరపకూడదు అంటూ ప్రభుత్వం హైకోర్టులలో పిటీషన్ వేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ఈసి తీసుకున్న నిర్ణయం పై స్టే ఇవ్వాలని, క-రో-నా నేపధ్యంలో ఎన్నికలు జరపటం సాధ్య పడదు అని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ పిటీషన్ పై హైకోర్టు లో విచారణకు వచ్చింది. అటు ఎన్నికల కమిషన్ తరుపు వాదనలు, ఇటు వైపు ప్రభుత్వం తరుపు వాదనలు కూడా హైకోర్టు వింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎన్నికల ప్రక్రియ నిలిపి వేయటం సాధ్యం కాదని హైకోర్టు తెలిపింది. దీంతో పాటుగా స్టే ఇవ్వటం కూడా సాధ్యం కాదని తెలిపింది. ఈ నెల 14వ తేదీకి కేసుని వాయిదా వేస్తూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎన్నికలు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో , నిర్వహించటం సాధ్యం కాదని, క-రో-నా వల్ల చాలా కేసులు వచ్చాయని, చాలా మంది మరణించారు అని, అలాగే రెవిన్యు, పోలీసులు యంత్రాంగం కూడా బిజీ గా ఉన్నారని, కోర్టులో వాదనలు వినిపించారు. అలాగే ఉద్యోగులు కూడా ఎక్కువ మంది వైరస్ బారిన పడి , ఇబ్బందులు పడుతున్నారని కోర్టుకు తెలిపింది.

hc 08122020 2

ప్రభుత్వం వైపు నుంచి వాదనలు విన్న తరువాత, ఎన్నికల కమిషన్ వైపు నుంచి అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా, హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయాన్ని కోర్టుకు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా ఆయన ప్రస్తావించారు. ఎన్నికల కమిషన్ ఒకసారి తేదీలు ప్రకటించిన తరువాత, అందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవటం, రాష్ట్ర ప్రభుత్వానికి తగదు అని, రాజ్యాంగా బద్ధ సంస్థ, పైగా స్వయం ప్రతిపక్తి కలిగిన సంస్థ విధుల్లో జోక్యం చేసుకోవటం ప్రభుత్వానికి తగదు అని, ప్రభుత్వం జోక్యం కుదరదు అని తెలిపారు. అలాగే బీహార్, కేరళ, రాజస్తాన్ హైకోర్టులు స్థానిక సంస్థలు నిర్వహించాలని ఇచ్చిన తీర్పులను హైకోర్టు ముందు పెట్టారు. హైదరాబాద్ జీహెచ్ఏంసి ఎన్నికల్లో, బీహార ఎన్నికలు, ఉప ఎన్నికలు అన్నీ జరుగుతున్నాయని, అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. అలాగే సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆరోగ్య అధికారులు అందరినీ సంప్రదించి, ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పటంతో, హైకోర్టు కూడా ఈ వాదనకు ఒప్పుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎన్నికలు వాయిదా వేయటం కుదరదు అని చెప్పింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read