ఎంపీ రఘురామకృష్ణం రాజు కేసు విషయంలో, సిఐడితో పాటు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ పై, వాళ్ళు టైంకి రిపోర్ట్ ఇవ్వకపోవటంపై, తమ ఆదేశాలు పాటించకపోవటంపై, హైకోర్టు కోర్టు ధిక్కరణ చర్యలు ప్రరంభించిన విషయం తెలిసిందే. అయితే నిన్న సుప్రీం కోర్టులో, తమ పై ఈ కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేసారని, హైకోర్టు కేసు కొట్టేయాలని కోరగా, ఆర్డర్ కాపీ ఉంటేనే మేము దాన్ని పరిశీలిస్తామని సుప్రీం కోర్టు చెప్పింది. అయితే ఈ రోజు హైకోర్టు ఆర్డర్ కాపీని అప్లోడ్ చేసింది. ఇందులో కొన్ని సంచలన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్, సుధాకర్ రెడ్డి, కోర్టు పై ప్రవర్తించిన తీరు పై హైకోర్ట్ తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. తమ ముందు వాదనలు వినిపిస్తూ, అడిషనల్ అడ్వొకేట్ జనరల్, సుధాకర్ రెడ్డి, గట్టిగా గట్టిగా కోర్టు పై అరిచారని, ఆర్డర్ ఫేక్, ఇల్లీగల్ అంటూ వ్యాఖ్యలు చేసారని, ఆయనకు అభ్యంతరం ఉంటే, అపీల్ చేసుకోవాలని కోర్ట్ వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలు ఎందుకు పాటించలేదు అని అడిగితే, అదే బిగ్గర గొంతుతో, మీరు ఇచ్చిన ఆర్డర్ కాపి రాత్రి 11 గంటలకు వచ్చింది, అప్పుడు మీ కోసం జైలు తలుపులు తెరవమంటారా అని అడిగారని, మరి ఉదయం ఎందుకు హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళలేదు అని అడిగితే, వాళ్ళు సుప్రీం కోర్టులో కేసు వేసారు కాబట్టి తీసుకుని వెళ్లలేదని చెప్పారని తెలిపింది.

hc 22052021 2

కోర్టు తనకు అడ్డుపడితే, తాను కోర్టు నుంచి వాక్ అవుట్ చేస్తానని అదే బిగ్గర గొంతుతో మాట్లాడారని కోర్టు తెలిపింది. అంతటితో ఆగకుండా, అసలు ఈ కేసులో మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు అంటూ, ఏకంగా కోర్టు పైన నినండలు మోపే ప్రయత్నం చేయటంతో, కోర్టు అతన్ని హెచ్చరించి, మాటలు అదుపులో ఉంచుకోవాలని సూచించినట్టు తెలిపింది. అయితే తాము పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగిన చోట కచ్చితంగా కలుగు చేసుకుంటామని, ఒక ఎంపీని కొ-ట్టా-ర-ని చెప్తున్నారని, ఫోటోలు బయటకు వచ్చాయని, సిఐడి కోర్టు మేజిస్ట్రేట్ కూడా గా-యా-లు ఉన్నట్టు చెప్పారని, అలంటి అప్పుడు, తాము తలుపులు మూసుకుని కూర్చోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక గుంటూరు హాస్పిటల్ డాక్టర్ కూడా, తాము 12 గంటలకు రిపోర్ట్ అడిగితే, సాయంత్రం 6.30 నిమిషాలకు ఇచ్చారని, అంతకు ముందు అనేక సార్లు కోర్టు నుంచి నివేదిక ఇవ్వమని ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదని, చివరకు 3.30 గంటలకు ఫోన్ లో కలిసి, రిపోర్ట్ పంపించేస్తున్నామని చెప్పి, చివరకు కోర్టు ఆరు గంటలకు కూర్చుంటే, 6.30 నిమిషాలకు ఇచ్చారని కోర్టు తెలిపింది. వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకునే, కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయమన్నామని కోర్ట్ తెలిపింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read