ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రాష్ట్ర ప్రభుత్వం, ఏ సమస్యా లేనట్టు, చింతామణి నాటకాన్ని నిషేధించటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. వందల ఏళ్ళ నాటి నాటకాన్ని ఎందుకు నిషేధించారో, దానికి వెనుక ఉన్న స్కెచ్ ఏంటో తెలియదు కానీ, దీని పైన కొందరు హైకోర్టుకు వెళ్ళారు. ఈ పిటీషన్ పైన ఈ రోజు విచారణ జరిగింది. ఈ పిటీషన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందుకు వచ్చింది. ఈ పిటీషన్ వేసిన రఘురామరాజు తరుపున, న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. అయితే ఇదే సందర్భంలో నాటకాన్ని నిషేధించటం సరైన నిర్ణయం అంటూ, ఆర్యవైశ్య సంఘాల తరపున 3 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీంతో ఇవి కూడా ఈ రోజు హైకోర్టు ముందుకు విచారణకు వచ్చాయి. అయితే ఇంప్లీడ్ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్ని వందల పిటీషన్లు దాఖలు చేస్తారు అంటూ, ఆగ్రహం వ్యక్తం చేసారు. విచారణను సాగదీయటానికి ఈ ఇంప్లీడ్ పిటీషన్లు వేస్తున్నారా అని ప్రశ్నించారు. ఒక ఇంప్లీడ్ పిటీషన్ ని కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రతివాదులు అందరికీ కోర్టు నోటీసులు ఇస్తూ, కేసు విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read