జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, తమది సంక్షేమ ప్రభుత్వం అని చెప్తూ ఉంటుంది. దీని కోసం రాజకీయంగా ఎన్నో జిమ్మిక్కులు కూడా చేస్తూ వచ్చింది. గతంలో ఇచ్చిన పధకాలు పేర్లు మార్చి, కొత్త పదకాలుగా చెప్పటం, ఏడాది గ్యాప్ ఇచ్చి, గత ప్రభుత్వంలో ఉన్న పధకాలు కొత్త పధకాలుగా చెప్పటం, కాలేజీలకు డైరెక్ట్ గా ఇచ్చి డబ్బులు, తల్లుల ఖాతాలో వేసి కొత్త పధకం అని చెప్పటం, ఇలా మొత్తంగా తమకు ఉన్న మీడియా, సోషల్ మీడియా ద్వారా, ఏదో సంక్షేమంలో ఇరగదీసినట్టు ప్రచారం చేసారు. చివరకు అక్కడ గత ప్రభుత్వాల్లో జరిగిన దాని కంటే, గొప్పగా ఇక్కడ సంక్షేమం ఏమి జరగటం లేదు. బోనస్ గా అభివృద్ధి ఆపేశారు. అయితే గత నాలుగు అయుదు నెలలుగా, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పింది, భవిష్యత్తులో కోలుకునే అవకాసం కూడా లేదు. అప్పులు కూడా గట్టిగా లాబీయింగ్ చేస్తే కానీ రాని పరిస్థితి, ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు కోతలు పెట్టటం మొదలు పెట్టింది. సంక్షేమ పధకాల లబ్దిదారులను తగ్గిస్తే, ఖర్చు తగ్గించుకోవచ్చానే ప్లాన్ అమలు చేసింది. అనర్హులు, అంటూ పధకాల్లో కోతలు పెట్టటం మొదలు పెట్టింది. దీని కోసం, ముందుగా రేషన్ కార్డుకు, ఆధార్ లింక్ చేస్తేనే పధకాలు అంటూ చెప్పటంతో, అందరూ ఆ పనిలో ఉన్నారు.
అలాగే గ్రామ, వార్డు సచివాలయంలో పని చేసే ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులని, వారు బీపీఎల్ ఫ్యామిలీ అయినా కోతలు పెట్టింది. ఇప్పుడు పెన్షన్ విషయంలో ఒకే ఇంటిలో రెండు పెన్షన్లు ఉంటే కుదరదు అని రద్దు చేసింది. దీంతో అందరూ లబో దిబో అంటున్నారు. వీరికి తోడు మొత్తం వాలంటీర్ల పెత్తనం కావటంతో, వారి ఇష్టా రాజ్యం అయిపొయింది. అయితే తాజాగా కృష్ణా జిల్లాలో చేయూత పథకం వర్తించదు అంటూ కొంత మందిని అనర్హులగా ప్రకటించటంతో వారు, ప్రతిపక్ష టిడిపి సహకారంతో కోర్టుకు వెళ్ళారు. దీంతో కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఒకసారి అర్హుడు అయిన వ్యక్తి, రెండో సారి అనర్హుడు ఎలా అవుతారు అంటూ ప్రశ్నించింది. ఒకసారి ఇచ్చిన సంక్షేమ పధకాలు, మళ్ళీ తీయటం కుదరదని, ర్జాకీయ కారణాలాతో నిలిపివేయటం కుదరదని చెప్పింది. వాలంటీర్లు లబ్దిదారులను తొలగించటం పైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, వారికి సర్విస్ రూల్స్ లేవు అంటూ కౌంటర్ ఇచ్చింది. వాలంటీర్ల ఇష్టాఇష్టాలతో సంక్షేమ పధకాలు తొలగిస్తే కుదరదని చెప్పింది. మొత్తంగా ఒకసారి లబ్దిదారుడు అని మీరే చెప్పి, మరోసారి అనర్హుడని ఎలా చెప్తారు అంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో లబ్దిదారులు టిడిపికి కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పుడు పెన్షన్ల విషయంలో కూడా అర్హులకు తొలగిస్తే, పోరాడతాం అని టిడిపి అంటుంది.