కొండపల్లి మునిసిపల్ నగర పంచాయతీ చైర్మెన్ ఎన్నిక, గత రెండు రోజులుగా, వైసీపీ సభ్యుల విధ్వంసంతో వాయిదా పడుతూ వచ్చింది. దీంతో తెలుగుదేశం పార్టీ ఈ అంశం పై, రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేసింది. దీంతో ఈ రోజు పిటీషన్ విచారణకు వచ్చింది. పిటీషన్ విచారణకు వచ్చిన సందర్భంలో కోర్టు సీరియస్ అయ్యింది. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నానికి, ఎక్స్ ఆఫిషియో సభ్యత్వం పై మున్సిపల్ కమిషనర్ ఎలాంటి వివరణ ఇవ్వక పోవటంతో, ఆయన గతంలో హైకోర్టుకు వెళ్ళటంతో, కోర్టు కేశినేని నానికి అనుమతి ఇస్తూ, అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అంటూ, ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో తమకు నివేదిక కూడా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. నగర పంచాయతీ సమావేశం 22న నిర్వహించాలని కూడా ఆదేశించింది. అయితే నిన్న ఉదయం సమావేశం ప్రారంభం కావటంతో, వైసీపీ సభ్యులు విధ్వంసం సృష్టించారు. దీంతో సమావేశం ఈ రోజుకి వాయిండా పడింది. ఈ రోజుకి కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యింది. ఈ నేపధ్యంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నేలకోనటం, ఈ రోజు కూడా సమావేశం వాయిదా వేయటంతో, ఈ రోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు అయ్యింది. ఈ లంచ్ మోషన్ పిటీషన్ పై ఈ రోజు మధ్యానం 12 గంటలకు వాదనలు ప్రారంభం అయ్యాయి.
ఈ వాదనల సందర్భంగా, కేశినేని నాని తరుపు న్యాయావాది అశ్వినీకుమార్, రెండు రోజులుగా అక్కడ జరిగిన విధ్వంసం గురించి కోర్టుకు చెప్పారు. నిన్న , ఈ రోజు వైసీపీ చేసిన గలాటాతో, ఎన్నికను నిరవధికంగా వాయిదా వేసారని చెప్పారు. అయితే దీని వెనుక కుట్ర ఉందని, టిడిపి నేతలను ప్రలోభాలు పెట్టేందుకు చేస్తున్నారని తెలిపారు. అదే విధంగా ఎన్నిక నిర్వహించాలన్న హైకోర్ట్ ఆదేశాలు కూడా పట్టించుకోలేదని, కేశినేని నాని ఓటు వేయకుండా ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ నేపధ్యంలో హైకోర్టు సీరియస్ అయ్యింది. అసలు ఎన్నిక నిర్వహించకుండా, నిన్న ఈ రోజు ఏమి చేసారని ప్రశ్నించింది. నిన్న సభ్యులు ఎలా వ్యవహరించారో ఆర్వో ఇచ్చిన రిపోర్ట్ చూస్తూ, ఇంత గొడవ చేస్తుంటే ఆర్వో ఎందుకు పోలీసులకు తెలపలేదని ప్రశ్నించారు. పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ అంశం పై హైకోర్టు సీరియస్ అవుతూ, మధ్నాహ్నం 2:15 గంటలకు విజయవాడ పోలీస్ కమీషనర్, కొండపల్లి మున్సిపల్ కమిషనర్ ను తమ ముందుకు రావాలని హైకోర్టు ఆదేశించింది.