ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చే ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ లో ఉండే అధికారులు పదే పదే ఉల్లంఘిస్తున్నారు. హైకోర్టు ఆగ్రహానికి కూడా గురి అవుతున్నారు. అంతే కాదు ఏకంగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు పోయిన వారమే హైకోర్టు శిక్ష కూడా విధించింది. అయినా పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించటం లేదు. ఈ రోజు హైకోర్టు మరోసారి అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచాయతీరాజ్ అలాగే, పాఠశాల విద్య శాఖ ఉన్నతాధికారులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. గ్రామ సాచివాలయాలను పాఠశాలల ఆవరణలోనూ, ఇతర విద్యాలయాల ఆవరణలోనూ నిర్మించవద్దు అని చెప్పి, గత ఏడాది జూన్ 11వ తేదీన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు పట్టించుకోకుండా, నెల్లూరు జిల్లాలోని కోటపోలూరు, అలాగే కర్నూల్ జిల్లాలోని తాళ్ళముడిపి అనే గ్రామాల్లోని పాఠశాల ఆవరణలో, గ్రామ సచివాలయాలను ఇప్పటికే దాదాపుగా పూర్తి చేసారని, రాష్ట్ర హైకోర్టులో పితీశండ్ దాఖలు అయ్యింది. వీటి పై రాష్ట్ర హైకోర్టులో గుంటూరుకు చెందిన హైకోర్టు న్యాయవాది, లక్ష్మీనారాయణ, అదే విధంగా మరో న్యాయవాది రామాంజనేయులు, ఈ విషయం పై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసి, కోర్టు ఆదేశాలున్నా నిర్మాణం చేపట్టటం పై సవాల్ చేసారు.

hcc 12072021 2

దీని పై ఈ రోజు హైకోర్టులో, కొద్ది సేపటి క్రితం విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి, పిటీషనర్ తరుపు న్యాయవాదులు లక్ష్మీనారాయణ, రామాంజనేయులు ఇద్దరూ కూడా, హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో హైకోర్టు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రామసచివాలయాలను, పాఠశాలల్లో నిర్మించవద్దని స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికి కూడా, అందుకు విరుద్దంగా అధికారులు వ్యవహరించిన తీరు మీద సూమోటోగా, కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. పంచాయతీరాజ్ కమీషనర్, సెక్రటరీకి, అదే విధంగా పాఠశాల విద్య శాఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమీషనర్లకు కూడా కోర్టు ధిక్కరణ కేసు కింద నోటీసులు జారీ చేయాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలు ఎందుకు అనుమతులు ఇచ్చారు, ఎవరు అనుమతులు ఇచ్చారనే విషయం తేల్చాలని, దీని పై పూర్తి స్థాయి విచారణ జరుపుతాం అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసి, కేసు విచారణను వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read