ఆంధ్రప్రదేశ్ పోలీసులు వరుస పెట్టి వివాదాల్లో ఉంటున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నేతల పై పోలీసుల వైఖరి, డీజీపీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. ఎన్ని విమర్శలు వచ్చినా, కోర్టుల్లో మొట్టికాయల పడినా, పోలీసులు లెక్క చేయటం లేదు. తాజాగా హైకోర్టు మరోసారి పోలీసులు పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి దియ్యా రామకృష్ణ కేసులో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులకు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జరీ చేసింది. పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేసారు అంటూ, దియ్యా రామకృష్ణ హైకోర్టులో కేసు వేసారు. కోర్టులో అరెస్ట్ చేయవద్దు అంటూ స్టే ఇచ్చినా, పిడుగురాళ్ల  పోలీసులు అరెస్ట్ చేసారని కోర్టుకు తెలిపారు. న్యాయవాదులు కోర్టు దిక్కరణ కేసుతో పాటుగా, పరువు నష్టం కేసు కూడా దాఖలు చేసారు. దీంతో పోలీసులు తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటీషనర్ వాదన వింటాం అని, వారి వాదన నిజ్కం అని తేలితే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది అంటూ, పోలీసులను హైకోర్టు హెచ్చరించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read