ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీర్పు పై హైకోర్టు, మరోసారి అక్షింతలు వేసింది. కడప జిల్లా పులివెందులలో, దళిత మహిళ అ-త్యా-చా-రం ఘటన పై, తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ అసమర్ధతను తప్పుబడుతూ, పెద్ద ఎత్తున ఆందోళన చేసి, చలో పులివెందుల కార్యక్రమం నిర్వహించారు. అయితే బాధిత కుటుంబానికి అండగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతల పై, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసారు. అయితే ఇదే నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అయినా వంగలపూడి అనిత పై కూడా, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసారు. అయితే వంగలపూడి అనిత, ఎస్సీ సామాజికవర్గం కావటంతో, అది కూడా గ్రహించకుండా, అనిత పై కూడా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయటంతో, అనిత న్యాయ పోరాటం చేసారు. హైకోర్టులో దీనికి సంబంధించి పిటీషన్ వేసారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తన పై కూడా పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసుని నమోదు చేసారని ఆమె హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. వంగలపూడి అనిత తరుపున న్యాయవాది బాలాజీ యలమంజుల వాదనలు వినిపించారు. పులివెందుల ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుతో పాటు, తెలుగుదేశం నేతలు కూడా బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డారని తెలిపారు.

hc police 19012021 2

ఆ మహిళకు న్యాయం చేయాలని నిరసన తెలపటం కూడా తప్పేనా అంటూ, వాదించారు. అయితే దీని పై స్పందించిన హైకోర్టు, బాధిత కుటుంబం తరుపున అండగా నిలబడితే కూడా, ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా అంటూ హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. గతంలో కూడా పలుమార్లు, ఇలాగే హైకోర్టు పోలీసులు పై అక్షింతలు వేసారు. ఎస్సీ మహిళ పైనే, ఎలా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. చట్టాలకు లోబడి కేసులు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులకు సూచించింది. గతంలో కూడా అమరావతి రైతులు పై ఇలాగే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి, బేడీలు వేసి చేసిన ఘటన సంచలనం అయ్యింది. అయితే అప్పుడు కూడా ఎస్సీల పైనే, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టటం పై, హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. చివరకు డీజీపీని రెండు సార్లు కోర్టు ముందు హాజరు అవ్వమని చెప్పారు. అయినా పోలీసులు తీరు మారలేదు. మళ్ళీ అదే తప్పు చేయటంతో, ఈ రోజు మళ్ళీ హైకోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read