ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ. ఈ దేశంలో అత్యున్నత వ్యవస్థల్లో ఒకటి, న్యాయ వ్యవస్థ. అలాంటి న్యాయ వ్యవస్థ టార్గెట్ అయితే, సిబిఐ ఈ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించే పరిస్థితితో, ఏపి హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సంచలన ఆదేశాలు ఇవ్వటానికి రెడీ అవుతుంది. ఇదే కనుక జరిగితే, ఇప్పటికే మసకబారిన సిబిఐ వ్యవస్థ, మరింతగా కిందకు దిగే అవకాసం ఉంది. ఒక కేసు విషయంలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఏకంగా హైకోర్టు పైన, న్యాయమూర్తుల పైన దా-డి చేసారు. హైకోర్టు రిజిస్టార్ కేసు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. బహుసా దేశంలో మొదటి సారి, రక్షించమంటూ హైకోర్టే కేసు పెట్టటం. విచారణ చేసిన హైకోర్టు, ఈ కేసుని సీరియస్ గా పరిగణించి, సిఐఐ దర్యాప్తుకు ఆదేశించింది. అయితే సిఐడి దర్యాప్తు సరిగా సాగక పోవటంతో, హైకోర్టు ఈ కేసుని సిబిఐకి అప్ప చెప్పింది. అయితే ఇప్పుడు సిబిఐ విచారణ కూడా సరిగా సాగటం లేదు. దీంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ రోజు ఈ కేసు పై విచారణ జరిగింది. దీని పై ఈ రోజు అత్యవసర విచారణ జరిగింది. అయితే స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినీ కుమార్ మాట్లాడుతూ, హైకోర్టు రిజిస్టార్ నుంచి లెటర్ వెళ్ళిన వెంటనే, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ నుంచి పంచ్ ప్రభాకర్ పోస్ట్ లు తొలగించినట్టు కోర్టుకు చెప్పారు.
అయితే ఇదే సందర్భంలో కల్పించుకున్న సిబిఐ, తాము కూడా ఈ విషయంలో లెటర్ రాసినట్టు చెప్పారు. అయితే ఈ విషయం పై హైకోర్టు సిబిఐ పై ఫైర్ అయ్యింది. లెటర్ రాసి ఏమి ఉపయోగం అంటూ సిబిఐని ప్రశ్నించింది. పంచ్ ప్రభాకర్ ని మీరు ఎలా పట్టుకుంటారో చెప్పండి అంటూ సిబిఐని ప్రశ్నించింది. సిబిఐ నుంచి సరైన సమాధానం రాకపోవటంతో, హైకోర్టు ఉగ్ర రూపం దాల్చింది. కోర్టు చెప్పింది మీరు వినటం లేదు, మీరు చెప్పింది మేము వినాల్సిన అవసరం లేదు, ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఏమిక్ హేయాలో చూస్తాం అని, దీని పై ఆదేశాలు ఇస్తాం అంటూ హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. అవసరం అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తాం అంటూ మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుని ఎలా డీల్ చేయాలో తమకు తెలుసు అని హైకోర్టు చెప్పింది. సాయంత్రం ఆదేశాలు ఇస్తాం అని చెప్పింది. ఒక వేళ సిబిఐ కాకుండా మరో ప్రత్యెక దర్యాప్తు బృందాన్ని కోర్టు నియమిస్తే, ఇది సిబిఐకి చెంపపెట్టు అనే చెప్పాలి. మరి ఏమి జరుగుతుందో సాయంత్రం తేలిపోతుంది.