తిరుమల తిరుపతి దేవస్థానంలో కొంత మంది నేర చరిత్ర ఉన్న వాళ్ళను సభ్యులుగా నియమించటం పై, హైకోర్టులో దాఖలు అయిన పిటీషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతికు చెందిన బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. టిటిడి పాలక మండలిలోని 18 మంది సభ్యులలో, అనేక మంది నేర చరిత్ర కలిగిన వారు ఉన్నారని, వీరిని వెంటనే బోర్డు పాలక మండలి నుంచి తొలగించాలని చెప్పి భాను ప్రకాష్ రెడ్డి వేస్తున్న పిటీషన్ ప్రతి సారీ వాయిదా పడుతూ వస్తుంది. ఈ రోజు కూడా అలాగే జరుగుతూ రావటంతో, పిటీషనర్ తారు న్యాయవాది, అశ్వనీ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ రోజు కూడా కేసు విచారణకు రావటంతో, వాయిదా వేయటంతో, ఇలా వాయిదా వేయటం కుదరదు అని, ఇది మంచిది కూడా కాదని, ఆయన ధర్మాసనం ముందు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో వెంటనే ధర్మాసనం, ఈ కేసు వివరాలు ఏంటి అని చెప్పి ప్రశ్నించింది. దీంతో టిటిడి పాలకమండలిలోని నేర చరిత్ర కలిగిన వారిని నియమించారని, దీన్ని సవాల్ చేస్తూ తాము హైకోర్టులో కేసు వేశామని, గతంలో ప్రత్యేక ఆహ్వానితులను ఇదే కేసులో తొలగించారని కూడా ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.

hc 311032022 2

దీంతో విషయం మొత్తం అర్ధం అవ్వటంతో, ధర్మాసనం ఒక్కసారిగా ప్రభుత్వం పై, టిటిడి న్యాయవాదుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవిల టిటిడికి సంబంధించిన ఒక బిల్డింగ్ ను, తిరుపతి కలక్టరేట్ కు ఉపయోగించుకుంటాం అంటే, ఇది విధాన పరమైన నిర్ణయం కాబట్టి కోర్టు సమర్ధించింది అని, ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలు సక్రమంగా ఉంటే, ఎప్పుడూ కూడా హైకోర్టు జోక్యం చేసుకోదని చెప్పింది. కానీ, ఈ రోజు టిటిడి పాలకమండలిలో, దేవుడు దగ్గర, నేర చరిత్ర ఉన్న వారిని ఎలా నియమిస్తారని చెప్పి, హైకోర్టు ధర్మాసనం నిలదీసింది. ఎప్పుడూ కూడా నేర చరిత్ర ఉన్న వారిని సభ్యులుగా ఉన్న వారిని నియమించటం ఏమిటి అని ప్రశ్నించటంతో పాటు, మీరు ఇష్టం వచ్చినట్టు ఇలా చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓపెన్ కోర్టులో ఇలా మాట్లాడాల్సి వస్తుందని కోర్టు పేర్కొంది. మొత్తం సభ్యుల విషయంలో కాకపోయినా, కొంత మంది నేర చరిత్ర ఉన్న వారి విషయంలో, హైకోర్టు సీరియస్ గా ఉందని, వారిని మీరు తొలగించాల్సి ఉంటుందని హైకోర్టు చెప్తూ, ఇక ఈ కేసు పై ఎలాంటి తాత్సారం ఉండదు అని, వచ్చే నెల 19న తుది విచారణ జరిపి, ఆర్డర్స్ కూడా ఇస్తామని, వాదనలకు రెడీ అవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read