ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోలను వెబ్ సైట్లో ఉంచకుండా గెజిట్ నోటిఫికేషన్ జారి చేయడం పై దాఖలైన ప్రజా ప్రయోజనలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ నిన్న విచారణ జరిగింది.. ఈ విచారణ సందర్భంగా హైకోర్ట్ ధర్మాసనం కీలక వాఖ్యలు చేసింది. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా,జస్టిస్ సత్యనారాయణ మూర్తి కూడిన ధర్మాసనం ఈ వాఖ్యలు చేయండంతో పాటు అసలు జివోల జారిలో పారదర్శకత ఉండి సాఫీగా జరిగిపోతున్న ప్రక్రియను ఎందుకు దాన్ని క్లిష్టతరం చేసారని హైకోర్ట్ నిలదీసింది. దీనితో పాటు ముఖ్యంగా ఏది సిక్రెట్, ఏది టాప్ సిక్రెట్ ఏది కాన్ఫిడెన్షియల్ అనేది మీరు ఎలా నిర్ణయిస్తారు అని కూడా ప్రశ్నించింది .పైగా సమాచార చట్టంలోని సెక్షన్ 4, సెక్షన్ 8 ఈ రెండు సెక్షన్ల ల ద్వారా కూడా ప్రజలకి ప్రాదమిక హక్కులున్నాయి. ప్రభుత్వంలో జరిగే కార్యకలాపాలు అదే విదంగా ప్రభుత్వంలో జరిగే జీవోలను కూడా తెలుసుకునే ప్రాధమిక హక్కు ప్రజలకు ఉందని, ఆ ప్రాధమిక హక్కును మీరెలా కాదంటారని హైకోర్ట్ ప్రశ్నించింది. సమాచార హక్కు చట్టంలో ఉన్న వివిధ సెక్షన్ లను సంతృప్తి పరిచే విదంగా అదే విధంగా జీవోలను వెబ్ సైట్లో పెట్టే విధంగా ఒక ప్రపోజల్ ను ప్రభుత్వమే తీసుకురావాలని కుడా, తాము ఆదేశాలు ఇచ్చే వరకు కూడా వేచి చూడవద్దని కూడా హైకోర్ట్ చెప్పింది.

hc jagan 23122021 2

పైగా కొన్ని జివోలను మాత్రమే తాము వెబ్ సైట్లో ఉంచుతున్నామని, మిగతా జివో లను ఉంచటం లేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పిన సమయంలో, ఏది సిక్రెట్ , ఏది టాప్ సిక్రెట్ ఏది కాన్ఫిడెన్షియల్ అనేది మీరు ఎలా నిర్ణయిస్తారు ప్రశ్నించటంతో పాటు ,ఇప్పటి వరకు ఎన్ని జీవోలను విడుదల చేసారు, ఎన్ని గెజిట్ లో ఉంచారు, ఎన్ని కాన్ఫిడెన్షియల్ ఉంచారు అనే సమాచారాన్ని వచ్చే వాయిదా కల్లా హైకోర్ట్ కు అందించాలని చెప్పి ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. పైగా ఇలాంటి జీవోలను దాచి పెట్టటం వల్ల, ప్రభుత్వంలో జరిగే విషయాలు ప్రజలకు తెలియకుండా పోయే అవకాసం ఉందని, ఇది ప్రజలకు తెలిసేలా ప్రాదమిక హక్కులను రాజ్యాంగం ప్రసదించినపుడు, అవి అమలయ్యే చూసేలా చేసే భాద్యత ప్రభుత్వానికి ఉందని, అటువంటి అంశాలని ఉల్లంఘిచటం అనేది ప్రభుత్వానికి మంచిది కాదని సూచిచింది. తెలంగాణలో హైకోర్ట్ ఏ ఆదేశాలు ఇచ్చిందో, అవి కూడా పరిశీలించామని, అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రతిపాదన తయారు చేసి, కోర్ట్ ముందు ఉంచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర హైకోర్ట్ ఆదేశించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read