ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య వస్తున్న గంజాయి కేసులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, అన్ని రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతున్న తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇతర రాష్ట్రాల పోలీస్ ఆఫీసర్ లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ, గంజాయి ఏపి నుంచి వస్తుందని చెప్పటంతో,ఏపి పరువు పోతుంది. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ఈ అంశం పై గట్టిగా పోరాడింది. దీంతో మొన్నటి దాకా, అసలు మా దగ్గర గంజాయి లేదు అని చెప్పిన పోలీస్, ప్రభుత్వ వ్యవస్థలు కదిలాయి. దేశ వ్యాప్తంగా విమర్శలు రావటంతో, గంజాయి తోటలు విధ్వంసం చేస్తున్నాయి. వందలకు వందల ఎకరాలు గుర్తిస్తున్నారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన అంశం, ఇంత పెద్ద మొత్తంలో గంజాయి సాగు అవుతుంటే, పోలీస్ వ్యవస్థ ఏమి చేస్తుంది ? దీని వెనుక పెద్దలు లేకుండా ఇది సాధ్యం అయ్యే పనేనా ? సామాన్యులకే కాదు, హైకోర్టుకు కూడా ఇదే అనుమానం వచ్చింది. పోలీసులు పట్టుకుంటున్న గంజాయి అక్రమ రవాణా కేసుల్లో, కూలి వాళ్ళు, లారీ డ్రైవర్లు, ఇలా చిన్న చిన్న వాళ్ళనే పట్టుకుని, వారిని అరెస్ట్ చేస్తున్నారని, కానీ వీరి వెనుక ఉండే వాళ్ళు, వీరి వెనుక ఉండే పెద్ద తలకాయలను మాత్రం, ఎందుకు పట్టుకోవటం లేదు అంటూ హైకోర్టు ప్రశ్నించింది.
ఇవన్నీ చూస్తుంటే, దర్యాప్తు జరుగుతున్న తీరు పై సందేహాలకు తావుఇచ్చే విధంగా ఉందని కోర్టు పేర్కొంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో భారీగా గంజాయి సాగు అవుతున్నట్టు కనిపిస్తుందని, అక్కడ ప్రజలకు ఇది చట్ట విరుద్ధం అని తెలియటం లేదని కోర్టు పేర్కొంది. ఆ ప్రాంతాల్లో పోలీసులు చైతన్య పరిచే కార్యక్రమాలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. కేసు నమోదు తరువాత, చార్జ్ షీట్ దాఖలు చేయటం లేదని, కేసు మూలాలను కనుగునలేక పోతున్నారని, పోలీసుల తీరు పై కోర్టు ఆక్షేపించింది. మాదాక ద్రవ్యాలు లాంటి తీవ్రమైన నేరాలు చేసిన కేసుల్లో కూడా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సీరియస్ గా లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇక సరైన సమయంలో చార్జ్ షీట్ వేయకపోతే, 180 రోజుల్లో వారికి బెయిల్ ఆటోమేటిక్ గా వస్తుందని, తరువాత పోలీసులు రిమాండ్ కోరాల్సి ఉంటుందని, అది కూడా జరగటం లేదని కోరుతూ అభిప్రాయపడింది. మొత్తంగా చిన్న చిన్న వారి పైన కాకుండా, పెద్ద తలకయాల పైన కూడా దృష్టి పెట్టాలని కోర్టు సూచించింది.