ఈ రోజు హైకోర్టులో, రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కు ఎదురయింది. ఎలా అయినా చంద్రబాబుని ఒక్క రోజు అయినా జైల్లో పెట్టాలని, ప్రభుత్వం పెట్టిన కేసులో పస లేకపోవటం, ప్రాధమికంగా హైకోర్టు అడిగిన బేసిక్ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకపోవటంతో, హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. రాజధాని అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి హైకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు, నారాయణ తరుపున లాయర్లు ఉదయం వాదనలు వినిపించారు. మధ్యానం నుంచి ప్రభుత్వం తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, కేసు పై, సిఐడి విచారణ పై స్టే విధించింది. నాలుగు వారాల పాటు, ఈ కేసు పై స్టే విధించింది. ఈ సందర్భంగా కంప్లైంట్ ఇచ్చిన ఆళ్ళకు నోటీసులు ఇచ్చి, ఆయన వాదన కూడా విననుంది. తరువాత చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ పై కోర్టు నిర్ణయం తెసుకునే అవకాసం ఉంది. అయితే ఈ సందర్బంగా హైకోర్టు, కొన్ని కీలక ప్రశ్నలు సంధించింది. ప్రధానంగా హైకోర్టు, సిఐడికి వేసిన ప్రశ్నతో, సిఐడి ఇచ్చిన సమాధానంతో,మొత్తం కేసు నీరుగారిపోయింది. కోర్టు ప్రశ్నిస్తూ, ఎఫ్ఐఆర్ లో ఏమి ఆధారాలు లేవు కదా, మీరు చేసిన ప్రాధమిక విచారణలో, మీరు ఎలాంటి ఆధారాలు సేకరించారు అంటూ కోర్టు సిఐడి ని ప్రశ్నించింది.
మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటో చెప్పాలని కోర్టు, సిఐడిని ప్రశ్నించింది. దీనికి స్పందిచిన సిఐడి, ప్రాధమిక విచారణ దశలో తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, కేసు పూర్తిగా దర్యాప్తు చేస్తే అప్పుడు ఆధారాలు అన్నీ సమర్పిస్తాం అంటూ సమాధానం చెప్పటంతో, కేసులో పసలేదనే వాదన అర్ధమైంది. సిఐడి చేతులు ఎత్తేయటంతో, చంద్రబాబు పిటీషన్ కు సగం బలం చేకురుంది. తరువాత కోర్టు మరో ప్రశ్న వేసింది. బాధిత రైతులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు, మీరు ఎందుకు ఫిర్యాదు చేసారు అంటూ కోర్టు ప్రశ్నించింది. అలాగే సెక్షన్ 146 సీఆర్డీఏ ప్రకారం, ఎలాంటి ప్రాధమిక ఆధారం లేకుండా, ఎలా విచారణ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఇలా కోర్టు అడిగిన అనేక ప్రశ్నలకు సిఐడి దగ్గర సమాధానం లేకుండా పోయింది. దీంతో హైకోర్టు ఒక అంచనాకు వచ్చి, నాలుగు వారాల పాటు ఎలాంటి ఆక్షన్ తేసుకోకూడదు అంటూ స్టే విధించింది. ఈ లోపు ఆళ్ళ కు నోటీసులు పంపించింది. ఆయన వాదన కూడా విని, క్వాష్ పిటీషన్ పై నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది.