ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి, రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ కు మరోసారి పిలుపు వచ్చింది. ఒక కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. గతంలో మూడు సార్లు డీజీపీకి హైకోర్టు రమ్మని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకసారి చంద్రబాబుని వైజాగ్ లో అడ్డుకున్న సమయంలో, ఆ సమయంలో డీజీపీని కోర్టులోనే ఆ సెక్షన్ కు సంబంధించిన వివరాలు చదవమని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఒకసారి హెర్బ్స్ కార్పస్ పిటీషన్ల విషయంలో కూడా డీజీపీ ఒకసారి హైకోర్టుకు హాజరు అయ్యారు. ఇకమరో కేసులో కూడా డీజీపీ హైకోర్టు ముందుకు వచ్చారు. అయితే ఇప్పుడు మరో కేసులో డీజీపీని రమ్మని హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం చర్చనీయంసం అయ్యింది. మంగళవారం హైకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రామారావు అనే ఒక ఏఎస్ఐని సిఐగా ప్రమోషన్ ఇచ్చే విషయంలో ఆయన కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా కోర్టులో వ్యాజ్యం వేయగా, కోర్టు సిఐగా ప్రమోషన్ ఇచ్చే ప్యానెల్లో ఆయనకు అవకాసం ఉందొ లేదో అనే అంశం పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పోలీస్ సఖ అమలు చేయలేదు అంటూ, ఏఎస్ఐ రామారావు మరోసారి కోర్టు ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన కోర్టు ధిక్కరణ పిటీషన్ వేసారు. హైకోర్టు తన పదోన్నతి విషయంలో పరిగణలోకి తీసుకోవాలని చెప్పినా, ఆ అంశం గురించి పట్టించుకోలేదు అంటూ కోర్టు దిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు. ఈ వ్యాజ్యం పై, మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ఈ వ్యజ్యంలోని ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ ప్రతివాదుల్లో హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, ఐజీలు, ఏలూరు రేంజ్ డీఐజీ ఉండగా, వీరిలో కేవలం ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్‌రావు తరుపు న్యాయవాది మాత్రమే కోర్టు విచారణకు వచ్చారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, ఐజీ తరుపు న్యాయవాదిని నియమించకపోవటంతో, న్యాయవాది రాక, ప్రతివాదులు కూడా రాకపోవటంతో కోర్టు సీరియస్ అయ్యింది. ఆ అధికారులు ముగ్గురికీ వ్యక్తిగత హాజరు నిమిత్తం ఫామ్-1 నోటీసు జారీచేశారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజీత్, డీజీపీ గౌతం సవాంగ్, ఐజీ మహేశ్‌చంద్ర లడ్డా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తూ, కేసుని జనవరి 25కు వాయిదా వేసింది.