ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క-రో-నా పరిస్థతి పై, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం, కో-వి-డ్ నియంత్రణ పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై, హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. సామాజిక కార్యకర్త తోటా సురేష్ బాబు వేసిన పిటీషన్ విచారణ నేపధ్యంలో, రాష్ట్రంలో ప్రస్తుతం కో-వి-డ్ ఉన్న పరిస్థితిపై, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై ఎప్పటికప్పుడు ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన గదులు, బెడ్స్ సంఖ్యను డిస్ప్లే చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నోటిఫై చేసిన హాస్పిటల్స్ కు సంబంధించి, నోడల్ ఆఫీసర్లు, వారి ఫోన్ నెంబర్లని కూడా ఎప్పటికప్పుడు డిస్ప్లే చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అత్యవసర మండుపు, ఆక్సిజన్ సప్లై, గదులు ఇలా ప్రతి సామాచారం, రోజు వారీ నివేదిక రూపంలో, హైకోర్టు దృష్టికి తీసుకురావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా రాష్ట్రంలో కో-వి-డ్ నిర్ధారణ పరీక్షలు వాటి సంఖ్య, ఫలితాలు, వీటి పై కూడా ధర్మాసనానికి రిపోర్ట్ ఇవ్వాలని తెలిపింది. దాదాపుగా రెండు గంటల పాటు, పిటీషనర్ తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు. అలాగే ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జెనెరల్ తో పాటు, ఇతర న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు.

hc 28042021 2

ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థతి చాలా దారుణంగా ఉందని, బెడ్ల విషయంలో కావచ్చు, బాధితులకు పరీక్షలు, ఫలితాలు రావటానికి సమయం పట్టటం, ఈ లోపు చాలా మందికి వైరస్ అంటటం లాంటివి జరుగుతున్నాయని, పిటీషనర్ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఆసుపత్రులు వద్ద కూడా చికిత్స అందించేందుకు ఇబ్బందులు పడుతున్నారు, బెడ్లు దొరకటం లేదు, అంబులెన్స్ ల లోనే, వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది, ఇలాంటి పరిస్థితిలో కో-వి-డ్ బాధితుల సంఖ్య పెరిగిపోతుందని, అదే విధంగా చికిత్సకు సంబంధించి, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తుందని, ప్రభుత్వం ఆదేశాలు అమలు కావటం లేదని, ప్రైవేట్ హాస్పిటల్ లో దోపిడీ జరుగుతుందని, హైకోర్టు కు తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరగా, స్పందించిన హైకోర్టు, కొన్ని కీలక సూచనలు ప్రభుత్వానికి చేయటమే కాకుండా, ప్రతి రోజు , రోజు వారీ నివేదిక, తమకు ఇవ్వాలని, రోజు వారీ సమీక్ష చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read