రఘురామకృష్ణం రాజు గురించి గుంటూరు ప్రభుత్వ మెడికల్ బోర్డ్, హైకోర్టుకు నివేదిక ఇచ్చిన తరువాత, హైకోర్టులో ఈ రోజు సాయంత్రం విచారణ ప్రారంభం అయ్యింది. విచారణ సందర్భంగా వాడీ వేడి వాదనలు జరిగాయి. ప్రభుత్వ న్యాయవాది, రఘురామరాజు న్యాయవాది మధ్య వాదనలు జరిగాయి. అయితే హైకోర్టు ఇప్పటి వరకు పూర్తి స్థాయి ఆదేశాలు ఇవ్వలేదు కానీ, ఇప్పటికిప్పుడు, రఘురామరాజుని రమేష్ హాస్పిటల్ కు తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. నిన్న సిఐడి కోర్టు ఏమి ఆదేశాలు ఇచ్చిందో, వాటిని యధావిధిగా ఇంప్లెమెంట్ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిఐడి కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో, కేవలం గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో పరీక్షలు నిర్వహించి, ఆయన్ను రమేష్ హాస్పిటల్ కు తరలించకుండా, ఈ రోజు మధ్యానం ఆయన్ను జిల్లా జైలుకు తరలించారు. దీని పట్ల రఘురామకృష్ణం రాజు తరుపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. జిల్లా జైలులో ఆయనకు ప్రాణ హాని ఉందని చెప్పి, తాము చెప్పిన ఇది రికార్డు చేసి, హైకోర్టు ఏ ఆదేశాలు ఇచ్చిన అభ్యంతరం వ్యక్తం లేదని చెప్పారు. అదే విధంగా సిఐడి కోర్టు ఇచ్చిన ఆదేశాలు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చినవి తీసుకుని అమలు చేసారని, ఇది తీవ్ర అభ్యంతరం అని చెప్పారు.
జైలులో తన క్లైంట్ కు ఏమైనా జరిగేతే, బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని, కోర్ట్ సరైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ నేపధ్యంలోనే హైకోర్టు తమ ఉత్తర్వులు రిజర్వ్ లో పెట్టి, అసలు ముందుగా రఘురామకృష్ణం రాజుని వెంటనే రమేష్ హాస్పిటల్ కు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. సిఐడి కోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రకారం, వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక ప్రభుత్వ తరుపు న్యాయవాదికి కూడా హైకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. సిఐడి కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో కేవలం, కొన్నిటిని మాత్రమే ఎందుకు అమలు చేసి, కొన్ని ఎందుకు వదిలేసారు అని ప్రశ్నించింది. సిఐడి కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా, ఆయన్ను ఎందుకు జిల్లా జైలుకి తరలించారు అని ప్రశ్నించింది. అలాగే మెడికల్ రిపోర్ట్ అందుకున్న తరువాత, మీరు పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని రఘురామకృష్ణం రాజు న్యాయవాదులను ఆదేశించింది. రేపు ఉదయం లోపు అఫిడవిట్ వేయాలని, ఈ లోపు తాము ఉత్తర్వులు ఇస్తామని కోర్టు తెలిపింది.