అమరావతి తరలించి, మూడు ముక్కలు చెయ్యాలనే, విషయంలో ఉత్సాహంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డికి, వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒక పక్క 34 వేల ఎకరాలు, రాజధాని కోసం ఇచ్చామని రైతులు, అలాగే ఇప్పటికే 10 వేల కోట్లు అమరావతిలో ఖర్చు పెట్టారని కొందరు, ఇలా అనేక పిటీషన్లు హైకోర్ట్ లో దాఖలు అయ్యాయి. అయితే అనేక పిటీషన్లు విచారణ సందర్భంగా, హైకోర్ట్, ప్రభుత్వ నిర్ణయం పై వ్యతిరేక కామెంట్లు చేస్తూనే ఉంది. ప్రతి సందర్భంలో, ప్రభుత్వాన్ని కోర్ట్, అనేక ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. అయితే రైతులు మాత్రం, తమ వాదనలు గట్టిగా వినిపిస్తూనే ఉన్నారు. ఇది ఇలా ఉండగా, అమరావతి నుంచి, కర్నూలుకువిజిలెన్స్‌ కమిషన్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎక్వైరీస్‌ కార్యాలయం, తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఒక జీవో ఇచ్చింది. అయితే, ఈ విషయం పై, కొంత మంది కోర్ట్ కు వెళ్లారు. ఈ విషయం పై గతంలో విచారణ చేసిన హైకోర్ట్, తీర్పు రిజర్వ్ లో ఉంచింది. అయితే ఈ రోజు, ఈ కేసు పై, హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

amaravati 20032020 12

కర్నూలుకు వివిధ కార్యాలయాలను తరలిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్ట్ నిలుపుదల చేసింది. కర్నూల్ కు విజిలెన్స్‌ కమిషన్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎక్వైరీస్‌ కార్యాలయాల తరలింపునకు ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేస్తూ ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది అనే చెప్పాలి. ఎక్కడో ఉన్న కర్నూల్ కు, ఆఫీస్ లు ఎలా తీసుకు వెళ్తారు అంటూ, పిటీషన్లు దాఖలు అయ్యాయి. విచారణ సందర్భంగా, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటూ హైకోర్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించటంతో, ప్రభుత్వ తరుపు న్యాయవాది స్పందిస్తూ, విజిలెన్స్‌ కమిషన్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎక్వైరీస్‌ కార్యాలయాలకు, అమరావతిలో సరైన చోటు లేదని, అందుకే కర్నూల్ కు వెళ్తున్నాం అని చెప్పారు.

amaravati 20032020 3

సరైన చోటు లేదు అని చెప్పటం పై హైకోర్ట్ అభ్యంతరం చెప్పింది. ఇక్కడ ఇంత ఖాళీ ఉండగా, కుర్నోల్ కు వెళ్ళాల్సిన అవసరం ఏమిటి, ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఈ నిర్ణయానికి ఎలా వచ్చారో, మీటింగ్ మినిట్స్ ఇవ్వాలి అంటూ,హైకోర్ట్ ప్రభుత్వ తరుపు న్యాయవాదిని కోరింది. అయితే ఇది సియం తీసుకున్న నిర్ణయం అని చెప్పటంతో, కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ప్రణాళిక లేకుండా, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పటం ఏమిటి అని, విచారణ సందర్భంగా కోర్ట్ ప్రశ్నించింది. అలాగే పిటీషనర్ తరుపు న్యాయవాది వాదనలు కూడా విన్న కోర్ట్, తీర్పు రిజర్వ్ లో పెట్టి, ఈ రోజు ఈ విషయం పై తీర్పు ఇస్తూ, ప్రభుత్వం ఇచ్చిన జీవో కొట్టేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read