అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పరిపాలన వికేంద్రీకరణ, అలాగే సిఆర్డీఏ రద్దు, ఈ రెండు బిల్లులు గవర్నర్ ఆమోదించటం, అలాగే గజెట్ విడుదల కావటంతో, రాజధాని రైతులు కోర్టు మెట్లు ఎక్కారు. పోయిన వారం దీని పై విచారణ చేసిన ధర్మసానం, 14 వరకు దీని పై యదాతధ స్థితి కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ రోజు 14 కావటంతో, ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణ చేసిన ధర్మాసనం, మళ్ళీ ఈ నెల 27 వరకు స్టేటస్ కో ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 27 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, అమరావతి పై యధాతధ స్థితి కొనసాగనుంది. అయితే ఈ సందర్భంలో హైకోర్టు స్టేటస్ కో ఇవ్వగానే, ప్రభుత్వ తరుపు న్యాయవాది స్పందిస్తూ, కావాలంటే వాయిదా వెయ్యాలని, కనీ స్టేటస్ కో ఇస్తే, ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేయటానికి వీలు లేకుండా పోతుందని, అందుకే స్టేటస్ కో ఎత్తేయాలని, హైకోర్టును విజ్ఞప్తి చేసారు.

అయితే హైకోర్టు ధర్మాసనం, ఈ ఆర్గుమెంట్ తో ఏకీభవించలేదు. ఈ కరోనా సమయంలో, మీరు అంత ఎమర్జెన్సీగా చేసే పనులు ఏమి ఉంటాయి, దీని పై స్టేటస్ కో ఇస్తున్నాం అంటూ, ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం తరుపున ఢిల్లీ నుంచి రాకేష్‌ త్రివేది వాదించారు. స్టేటస్ కో ఇస్తే, కార్యాలయాలు తరలించే అధికారం లేకుండా పోతుందని, అన్నిటికీ ఈ ఉత్తర్వులు ఇబ్బందిగా ఉంటాయని అన్నారు. అయితే రాకేష్‌ త్రివేది మాటలను, పిటీషనర్ తరుపు న్యాయవాది వ్యతిరేకించారు. చట్టాన్ని ఉల్లంఘించి చేస్తున్నారు కాబట్టే, మేము స్టేటస్ కో అడిగామని, దాన్ని తీయటానికి వీలు లేదని కోర్టు ముందు వాదించారు. దీంతో ఇరు పక్షాల వాదన విన్న హైకోర్టు, స్టేటస్ కో వైపే మొగ్గు చూపుతూ, ఈ నెల 27కి కేసును వాయిదా వేసింది. ఈ పరిణామం పై, రాజధాని రైతులు, మహిళలు సంతోషం వ్యాప్తం చేసారు

Advertisements

Advertisements

Latest Articles

Most Read