ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఈ రోజు రాజధాని అమరావతి విషయంలో కీలక తీర్పు ఇవ్వనుంది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పుని వెల్లడించనుంది. ప్రధానంగా మూడు రాజధానుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నా, సిఆర్డీఏ మళ్ళీ అమలులోకి వచ్చినా కూడా, రైతులకు సంబంధించి అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయని, ముఖ్యంగా భూసమీకరణ ఒప్పందాన్ని అమలు చేయక పోవటం, రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏవి అయితే ఉన్నాయో, వాటిని అమలు చేయక పోవటం, అదే విధంగా మాస్టర్ ప్లాన్ కి తిలోదకాలు ఇవ్వాటం, ఈ మూడు అంశాల పై రైతులు ప్రధానంగా పట్టు బట్టారు. తాము దాఖలు చేసిన పితెషన్ లో ఈ అంశాలు కూడా ఉన్నాయని, అందు వల్ల వీటి పైన విచారణ కొనసాగించాలని పిటీషనర్లగా ఉన్న రైతుల తరుపు న్యాయవాదులు కోర్టుకు అభ్యర్ధించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకోవటంతో, ఈ పిటీషన్లకు విచారణ అర్హత లేదని ప్రభుత్వం తరుపు న్యాయవాదులు వాదించారు. సుమారు వారం రోజులు పాటు జరిగిన ఈ వాదనలు అనంతరం, గత నెల 4వ తేదీన హైకోర్టు, ఈ తీర్పుని రిజర్వ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

amaravati 03032022 2

ఈ కేసు పైన, ఈ రోజు ఉదయం 10.30 గంటలకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం సమావేశం అయ్యి, తీర్పు ఇస్తుందని, నిన్న రాత్రి హైకోర్టులో ప్రకటించిన షెడ్యుల్ లో పేర్కొన్నారు. అయితే ప్రధానంగా రాజధాని అమరావతికి సంబంధించి, రైతులు మాత్రం, తాము వేసిన పిటీషన్లో ఇంకా చాలా అంశాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నా మళ్ళీ, ప్రజలు అభిప్రాయాన్ని సేకరించి, ఈ సారి సమగ్ర చట్టాన్ని పెడతామని చెప్పి, హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనటం పట్ల, ఈ పిటీషన్ లైవ్ లో ఉంచాలని, పిటీషనర్ తరుపున న్యాయవాదులు కోరారు. ఈ నేపధ్యంలో, రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చే తీర్పు పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మూడు రాజధానులు చట్టం ప్రభుత్వం వెనక్కు తీసుకున్నది కనుక, ఈ పిటీషన్లు విచారణ చేయనవసరం లేదనే ప్రభుత్వ వాదన ఎంత వరకు హైకోర్టు ఈ అంశం పై ఏకీభవిస్తుంది, అసలు ఏమి చెప్తుంది అనేది ఈ రోజు తేలిపోతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read