కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. కొండపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఓటు హక్కు వినియోగానికి సంబంధించి, హైకోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటీషన్లో విచారణ జరుగుతుంది. ఈ విచారణ సందర్భంగా నిన్న కూడా ఈ కేసు పై వాదనలు జరిగాయి. ఈ రోజు మళ్ళీ విచారణ ప్రారంభం అయిన సమయంలో, ఈ రోజు మధ్యానం లంచ్ కు ముందు, ఎంపీ కేశినేని నాని తరుపున, హైకోర్ట్ న్యాయవాది అశ్వనీ కుమార్, అలాగే వైసీపీ కౌన్సిలర్ల తరుపన సీతారం వాదనలు వినిపించారు. ఈ వాదనలు సందర్భంగా, కౌన్సిలర్ల తరుపు న్యాయవాది హైకోర్టు బెంచ్ తో, వాదనకు దిగారు. తనకు అవకాసం కల్పిస్తామని చెప్పినా కూడా, ఆయన వాదనకు దిగటంతో, న్యాయమూర్తి ఆగ్రహించి, బెంచ్ పైన నుంచి లెగిసి లంచ్ కు వెళ్ళిపోయారు. లంచ్ నుంచి వచ్చిన తరువాత జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, వైసీపీ కౌన్సిలర్ల తరుపు న్యాయవాది పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ కేసు వాదనలు తాను వినబోనని, ఈ కేసు నుంచి తప్పుకుంటానని ఆయన స్పష్టం చేసారు. ఈ సమయంలో ఎంపీ కేశినేని తరుపు న్యాయవాది అశ్వనీ కుమార్ జోక్యం చేసుకుని, మీరు ఎందుకు వినను అంటున్నారో ఆ రీజన్ కూడా రాయాలని కోరారు.

justice 22122021 2

ఆ కారణం కూడా రికార్డు చేయాలని అభ్యర్ధించారు. ఆ తరువాత కేసు నుంచి మీరు తప్పుకోవచ్చని సూచించారు. దీంతో జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తాను ఎందుకు ఈ వాదన వినబోను, ఎందుకు ఈ కేసు నుంచి తప్పుకుంటున్నాను అనే విషయంకు సంబంధించి, ఆయన తన అభిప్రాయాన్ని రికార్డు చేస్తానని చెప్పారు. రికార్డు చేస్తానని చెప్పిన తరువాత, తాను ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నా అని చెప్పటంతో పాటుగా, ఈ సమాచారాన్ని ప్రధాన న్యాయమూర్తి కి పంపించి, ఈ కేసుని వేరే బెంచ్ కు బదిలీ చేయాలని చెప్పి, కోరారు. దీంతో దాదాపుగా వారం రోజులుగా జరుగుతున్న విచారణ అర్ధాంతరంగా వాయిదా పడింది. మరో వైపు రెండు రోజుల తరువాత, ఈ కేసు పైన చీఫ్ జస్టిస్ ఒక నిర్ణయం తీసుకుని, వేరే బెంచ్ కు ఈ కేసుని బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు కూడా ఈ కేసు విచారణ జరిగే అవకాసం లేదు. అయితే వైసీపీ కౌన్సిలర్ల తరుపన న్యాయవాది, ఎందుకు అలా వ్యవహరించారు, ఆయన పైన చర్యలు ఏమైనా ఉంటాయా అనేది చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read