ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో లలితకుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై ఆసక్తికరమైన వాదనలు జరిగాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సిఆర్పీసి సెక్షన్ 54 కింద, వ్యక్తులను అదుపులోకి తీసుకుని, అతన్ని విచారించి, ఆ తరువాత వైద్య పరీక్షలు నిర్వహించి, మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాల్సి ఉందని, కానీ అలా కాకుండా సిఆర్పీసి సెక్షన్ ను ఉపయోగించుకుని, వీరిని అదుపులోకి తీసుకుని, పోలీసులు కస్టడీలోనే వేధింపులకు గురి చేస్తున్నారు అని చెప్పి, లలిత కుమార్ అనే వ్యక్తి పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ ఈ రోజు హైకోర్టు ముందు విచారణకు వచ్చింది. ఈ పిటీషన్ విచారణ సందర్భంగా న్యాయవాది ఉమేష్ చంద్ర, వాదనలు వినిపించారు. ఈ ఏడాది ఇప్పటికే ఈ విధంగా వ్యక్తుల మీద, ముగ్గురు పైన పోలీస్ కస్టడీలో చిత్ర హింసలకు గురి చేసారని న్యాయావాది ఉమేష్ చంద్ర హైకోర్టు ముందు పేర్కొన్నారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుతో పాటుగా, తెలుగుదేశం పార్టీకి చెందిన నాదెండ్ల బ్రహ్మం వీరి ఇద్దరి పైన కూడా పోలీస్ కస్టడీలోనే టార్చర్ కు గురి చేసారని, ఆయన ధర్మాసనం ముందు చెప్పారు. ఈ విధంగా చేయటం వల్ల సిఆర్పీసి సెక్షన్లు ఉల్లంఘించటమే కాకుండా, పోలీసులు లేని అధికారులను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని వాదించారు.

dgp 10112021 2

కొంత మంది కింద స్థాయిలో ఉండే మేజిస్ట్రేట్లు కూడా మెకానికల్ ఎవరైనా సరే, తమను పోలీస్ కస్టడీలో టార్చర్ చేసారని చెప్పనా కూడా, వారిని హాస్పిటల్ కు పరీక్షల కోసం పంపించకుండా, వారిని రిమాండ్ కు పంపించటం పైన కూడా, ఆయన అభ్యంతరం వ్యక్తం చేసారు. దీని పై ఇటీవల నాదెండ్ల బ్రహ్మం కేసులో జరిగిన అంశాన్ని ఆయన ఈ సందర్భంగా ధర్మాసనానికి గుర్తు చేసారు. ఈ సందర్భంగా ఉమేష్ చంద్ర వాదనలను విన్న ధర్మాసనం, ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అనుమతి ఇస్తూ, రాష్ట్ర డీజీపీకి, చీఫ్ సెక్రటరీ కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగంలో ఏదైతే నిబంధనలు ఉన్నాయో, ఆ నిబంధనలు అన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాలని, ఇందులో ఎటువంటి సందేహాలకు తావు లేదని, అందరూ చట్టాలను ఉన్నది ఉన్నట్టు పాటించాల్సిందే అంటూ, హైకోర్టు కామెంట్స్ చేస్తూ, డీజీపీ, చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read