ఆంధ్రపదేశ్ హైకోర్టులో నిన్న, ప్రభుత్వానికి, హైకోర్టు చీఫ్ జస్టిస్ కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. నిన్న అమరావతి మార్పు విషయం పై, దాఖలైన పిటీషన్ల పైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రోజు వారీ విచారణ ప్రారంభం అయ్యింది. నిజానికి రోజు వారీ విచారణలో ఇది మూడో బెంచ్. గత రెండు సార్లు, వాదనలు వినటం, చీఫ్ జస్టిస్ బదిలీ కావటంతో, ఇప్పుడు మూడో సారి ఫుల్ బెంచ్ విచారణ జరుపుతుంది. చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ బెంచ్ లో మొత్తం ముగ్గురు న్యాయమూర్తులు ఉన్నారు. త్రిసభ్య ధర్మాసనం, నిన్నటి నుంచి ఈ విచారణ ప్రారంభించింది. అయితే విచారణ ప్రారంభం కాగానే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఈ పిటీషన్లకు తోడుగా మరొక అనుభంద పిటీషన్ వేసారు. అందులో, బెంచ్ లో ఉన్న ఇద్దరు న్యాయమూర్తుల పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ, వారిని ఈ విచారణ నుంచి తప్పించాలి అంటూ, చీఫ్ జస్టిస్ ను కోరారు. త్రిసభ్య ధర్మాసనంలో ఉన్న ఇదరి న్యాయమూర్తులకు ప్రభుత్వం, అమరావతిలో ఫ్లాట్లు ఇచ్చిందని, వారికి ఆర్ధికపరమైన ప్రయోజనాలు ఈ అంశంతో ముడి పడి ఉన్నాయి కాబట్టి, వారు ఈ పిటీషన్ విచారణలో ఉండకూడదు అంటూ అనుబంధ పిటీషన్ వేసారు.

hc 16112021 2

దీని పైన చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ఘాటుగానే బదులు ఇచ్చారు. ఒక ప్రభుత్వం వైపు నుంచి ఇలాంటి వినతులు రావటం దురదృష్టకరం అని అన్నారు. గతంలో కూడా ఇదే న్యాయమూర్తులు, అమరావతి కేసుల విచారణలో ఉన్నారని, అప్పుడు మీరు ఎందుకు అభ్యంతరం తెలపలేదని ప్రశ్నించారు. ఒక వైపు న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఉందని చెప్తూనే, ఇప్పుడు ఇలాంటి పిటీషన్లు వేస్తున్నారని అన్నారు. అమరావతిలో చాలా మంది న్యాయమూర్తులకు ప్రభుత్వం ఫ్లాట్లు ఇచ్చిందని, అది విధానపరమైన నిర్ణయం అని అన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట, ఎవరికో ఒక జడ్జిలకు భూములు ఉంటాయని, అలా అనుకుంటే అసలు ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ కేసు కూడా ఇక్కడ వాదించకూడదని అన్నారు. తాను కూడా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నా కాబట్టి, తాను కూడా ఈ పిటీషన్ విచారణ చేయకూడదా అని ప్రశ్నించారు. ఈ పిటీషన్ ఈ హైకోర్టులో విచారణ చేయటానికి, మీకు అభ్యంతరం ఉంటే, వేరే హైకోర్ట్ కు ఈ కేసు బదిలీ చేయాలని, సుప్రీం కోర్టుని అడగవచ్చని చీఫ్ జస్టిస్ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read