ఈ రోజు కరోనా నివారణ కోసం, నెల్లూరు జిల్లా కృ-ష్ణ-ప-ట్నం-లో, ఆ-నం-ద-య్య ఇస్తున్న మం-దు పై, హైకోర్టులో పూర్తి స్థాయి విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలు మం-దు కావాలని కోరుకుంటున్నారని, అటువంటి అప్పుడు మందు వీలైనంత త్వరగా ప్రజలకు ఇవ్వాలని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో పాటుగా, వీలైనంత త్వరగా ఈ రిపోర్ట్ లు కూడా తెప్పించాలని హైకోర్టు ఆదేశించింది. టెక్నికాలిటీస్ చెప్పొద్దని, టెక్నికాలిటీస్ చెప్తే మాత్రం ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా లేట్ అవుతాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్కడకు వెళ్తే వ్యాధి తగ్గుతుందని, ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడినప్పుడు, ఆ నమ్మకాన్ని సడలించకుండా చూడాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పటంతో పాటు, ఈ మం-దు వేసుకోవటం వలన ఏమైనా హాని జరుగుతుందా లేదా అనేది మాత్రమే గుర్తించండి, దానికి సంబంధించి మాత్రమే మీ రిపోర్ట్స్ ని పరిశీలించండని హైకోర్టు ఆదేశించింది. దీంతో పాటుగా, ఆ-నం-ద-య్య, ఆ-యు-ర్వే-ద కౌన్సిల్‍లో, ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ మందు పై రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, తిరుపతిలో ఆ-యు-ర్వే-ది-క్ మెడికల్ కళాశాల వైద్యుల నుంచి, పరీక్షలు జరుపుతున్నాం అని చెప్పి ప్రభుత్వం పేర్కొంది.

anandayya 27052021 1 2

ఈ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి, ఈ సమయంలో హైకోర్టు జోక్యం చేసుకుని ప్రశ్నించింది. ఈ రిపోర్ట్స్ 29న వస్తాయని ప్రభుత్వం చెప్పింది. అయితే మం-దు పంపిణీ చేయవద్దు అని చెప్పి లోకాయుక్తా ఎలా ఆదేశాలు ఇస్తుందని చెప్పి, పిటీషనర్ తరుపు న్యాయవాది క్రిష్నయ్య ప్రశ్నించారు. దీంతో పాటుగా అనంతపురం జిల్లాకు చెందిన మరో పిటీషనర్ తరుపు న్యాయావది యలమంచలి బాలాజీ మాట్లాడుతూ, చేప మం-దు కోసం, దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు అనేక మంది వస్తున్నారని, అదే కోవలో ఈ మం-దు-ను పరిగణించాలని, ఎందుకు దీనికి అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం ఆపివేసిందని నిలదీశారు. ప్రజల్లో విశ్వాసం ఉన్నప్పుడు, ఆ విశ్వాసానికి అనుగుణంగా, ప్రభుత్వాలు పని చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇక ఆ-నం-ద-య్య తరుపున అశ్వినీ కుమార్ వాదనలు వనిపించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. సోమవారానికి విచారణ వాయిదా వేసింది. ఈ లోపు అన్ని రిపోర్ట్ లు తెప్పించుకుని, దీని పై ఒక నిర్ణయం తీసుకోవోలని హైకోర్టు ఆదేశించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read