ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నిధుల కోసం, మిషిన్ బిల్డ్ ఏపి పేరిట, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో ఉన్న విలువైన ఆస్తుల అమ్మకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ఇలా రాష్ట్ర సంపద అయిన, ప్రభుత్వ ఆస్తులు అమ్మి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చుకోవాలని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్, దీని పై ఒక పిటీషన్ దాఖలు చేసారు. ఆయనతో పాటు, మరో తొమ్మిది మంది కూడా, మొత్తం 10 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసారు. ఈ పిటీషన్ల పై గత మూడు నెలలుగా, రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ రోజు కూడా హైకోర్టులో ధర్మాసనం ముందు ఈ పిటీషన్ విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా పిటీషనర్ తరుపు న్యాయవాదులు, అదే విధంగా ప్రభుత్వం తరుపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనల నేపధ్యంలోనే, హైకోర్టు ధర్మాసనం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఆర్ధిక ఎమర్జెన్సీ ఏమైనా నడుస్తుందా ఏంటి అంటూ, హైకోర్టు ప్రశ్నించింది. దీంతో పాటు, ఆంధ్రప్రదేశ్ లో ఆస్తులు అమ్మి మరీ, ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా అని ప్రశ్నించింది.

hc 11122020 1

అయితే ఇదే సందర్భంలో, హైకోర్టు కొంచెం వెటకారంగా, క-రో-నా కాలంలో, అత్యధిక ధరలకు, పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసి, మందు బాబులు, రాష్ట్ర ఖజానాలో డబ్బులు నింపటానికి పాటుపడ్డారని, వాళ్లకు కృతఙ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ వ్యంగ్యంగా వ్యఖ్యానించింది. అయితే ప్రభుత్వ తరుపు న్యాయవాది మాట్లాడుతూ, తాము ఎందుకు భూములు అమ్మి, డబ్బు సమకూర్చుకోవాలని అనుకుంటున్నామో చెప్పారు. తమ ప్రభుత్వం, ఈ దేశంలోనే ఎవరూ చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని, ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అందుకే అవసరం అని చెప్పగా, మీరు ఎంత బాగా అమలు చేస్తున్నారో అందరికీ తెలుసు అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ప్రభుత్వం వేసిన కౌంటర్లు అన్నీ కూడా, పిటీషనర్లకు అందచేలయని హైకోర్టు ఆదేశించింది. వాదనలు పూర్తయిన అనంతరం, కౌంటర్లను వారికి అందచేయాలని చెప్తూ, ఈ కేసుని ఈ నెల 17కు వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read