మిషన్ బిల్డ్ ఏపి పేరుతో, ప్రభుత్వ ఆస్తులు అమ్మి సొమ్ము చేసుకోవాలని చెప్పి, ఈ టెండరింగ్ ద్వారా, ఈ క-రో-నా సమయంలో, ఆస్తులు అమ్మాలని చెప్పి,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ, గుంటూరు జిల్లాకు చెందిన తోటా సురేష్ గారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని, హైకోర్టులో దాఖలు చేసారు. వీటితో పాటుగా, మరో తొమ్మిది పిటీషన్ లు, ముఖ్యంగా విశాఖపట్నం, గుంటూరు లాంటి ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తులని అమ్మి, ఏదైతే ప్రభుత్వం చేపడుతున్న స్కీములు కోసం, వాటికి ఖర్చు చేయాలని, అమ్మిన డబ్బులతో స్కీములు చేయాలని, ప్రభుత్వం భావించింది. అయితే వీటిని హైకోర్టు ముందు ఛాలెంజ్ చేసారు. ఈ కేసుని గౌరవ జస్టిస్, రాకేశ్ కుమార్ గారు, జస్టిస్ ఉమా దేవి గార్లు ఈ కేసుని విచారణ చేయటం జరిగింది. అయితే ఈ కేసుని విచారణ చేసే సమయంలో, ప్రభుత్వం తరుపున, జస్టిస్ రాకేశ్ కుమార్ గారిని తప్పించాలని, ప్రభుత్వం హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసింది. అయితే ఆ పిటీషన్ ఏది, నెంబర్ ఏది, అనేది ఈ కేసు వేసిన పిటీషనర్లకు నోటీసులు ఇచ్చారా అని, ధర్మాసనం ప్రశ్నించింది. అయితే దీని పై స్పందించిన పిటీషనర్ తరుపు న్యాయవాదులు, ఎటువంటి, నోటీసులు, సర్వ చేయలేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో పాటుగా, కొన్ని పిటీషన్ లలో ప్రభుత్వం, ఇప్పటికే హైకోర్టు ఆదేశించినప్పటికీ, కౌంటర్స్ దాఖలు చేయలేదు. అయితే ఈ విధంగా జడ్జిలను తప్పించాలని పిటీషన్ లు వేసి, కేసు ముందుకు వెళ్ళకుండా, కేసుని అడ్డుకుంటున్నారని అన్నారు.

highcourt 17122020 2

కనీసం పిటీషనర్ కు దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వకుండా, అడ్డుకుంటున్నారు కాబట్టి, ఇలాంటి చర్యల పై, ధర్మాసనం సీరియస్ గా స్పందించింది. జస్టిస్ రాకేశ్ కుమార్ గారు స్పందిస్తూ, నేను రిటైర్మెంట్ అవుతున్నాని తెలిసినా, ఇలా పదే పదే ఈ కేసులో అడ్డు పడటం కరెక్ట్ కాదు, అవసరం అయితే ఇలా పదే పదే కేసు విచారణ ముందుకు వెళ్ళనివ్వకుండా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నందుకు కంటెంప్ట్ అఫ్ కోర్ట్ కింద కూడా మేము మూవ్ చేయటానికి వెనుకాడం అంటూ సీరియస్ గా స్పందించారు. దీంతో పాటుగా, పిటీషన్ వేసి ఉంటే దాన్ని పరిశీలిస్తాం, అయితే పిటీషన్ రికార్డ్స్ లో లేని సందర్భంలో, రెండోది అవతల వైపు నోటీసులు ఇవ్వకుండా, ఈ విధంగా చేయటం సరైన పద్దతి కాదు, ఇది కోర్ట్ ప్రొసీడింగ్స్ ని అడ్డుకోవటమే అని, ఏదైనా సోమవారం లోపు అన్నీ సరి చేసుకోవాలని, లేని పక్షంలో దీని పై సోమవారం తుది విచారణ చేపడతాం అని, ప్రభుత్వం దీనికి సిద్ధంగా లేకపోతే, దీని మీద తదుపరి చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం ఆదేశించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read