ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కొన్ని భూములు అమ్మి సొమ్ము చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి బిల్డ్ ఏపి అని పేరు పెట్టారు. అయితే ప్రతిపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు, ఈ తీరుని తప్పు బట్టినా, ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గలేదు. ఈ విషయం పై, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, హైకోర్టులో మూడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. ఈ పిటీషన్ పై, ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా, ప్రభుత్వం కూడా, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఈ సందర్భంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ, ప్రభుత్వానికి ఆస్తులు అమ్మే, హక్కు ఉందా అనే విషయం విచారణ చెయ్యాల్సి ఉందని చెప్తూ, ఇరు వర్గాల వాదన విన్న హైకోర్టు, విచారణను రేపటికి వాయిదా వేసింది.
మరో వైపు, హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేస్తూ, రాజ్యం వేరు, ప్రభుత్వం వేరు అనే విషయం, ఈ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలి అంటూ, కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యం అనేది శాస్వతం ఉంటుందని, ప్రభుత్వం శాస్వతం కాదు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని, హైకోర్టు వ్యాఖ్యానించటం సంచలనంగా మారింది. హైకోర్టు ఈ విషయంలో చేసిన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ప్రభుత్వానికి ఉన్న ఆస్తులు భవిష్యత్తు తరానికి ఇవ్వటానికి కానీ, అవి అమ్మి సొమ్ము చేసుకోవటానికి కదానే వాదన ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రాజెక్ట్ ల కోసం, ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి, భూములు కొంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములు అమ్మి, ఉన్న భూములు అమ్మించటం దారుణం అని అంటున్నారు.