ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మూడో దశకు చేరుకున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో మూడో దశ సందర్భంగా, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలకు ఓటింగ్, ఈ మూడో దశలో జరగబోతుంది. ఈ మూడో దశలో ఓటింగ్ కు సంబంధించి, అత్యంత కీలకమైన తీర్పును ఇచ్చింది. మరో 24 గంటల్లో ఎన్నికలు, ఓటింగ్ జరగనున్న సమయంలో, ఇది అత్యంత కీలకమైన తీర్పు అనే చెప్పాలి. గత రెండు దశల్లో కూడా ఒక పార్టీ తరుపున మద్దతుతో ఎన్నిక అయితే, ఎన్నిక జరిగినట్టు డిక్లేర్ చేసిన తరువాత, మరో పార్టీ మద్దతుతో గెలిచినట్టు రీకౌంటింగ్ లో ప్రకటించిన దాని పై, కొంత మంది హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టుని ఆశ్రయించిన వారి తరుపున, మాజీ అడ్వొకేట్ జెనెరల్, సీనియర్ న్యాయవాది, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఈ వాదనలు నేపధ్యంలోనే హైకోర్టు అత్యంత కీలకమైన ఉత్తర్వులును ఈ రోజు జారీ చేసింది. ఈ నెల 13న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొన్ని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో జరిగే ఓట్ల లేక్కుంపు మొత్తం కూడా వీడియో చిత్రీకరణ చేయాలని సూచించింది. అయితే 15వ తేదీన సమస్యాత్మక గ్రామాలు , అత్యంత సమస్యాత్మక గ్రామాలు మాత్రమే వీడియో షూటింగ్ చేయాలని చెప్పి, ఎన్నికల కమిషన్ మరో ఆదేశాలు జారీ చేసింది.

hc 16022021 2

ఈ రోజు ఆదేశాల నేపధ్యంలో, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని, నిజాయతీగా జరగాలని, కౌంటింగ్ సమయంలో జరుగుతున్న అవకతవకలను దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ నేపధ్యంలోనే, హైకోర్టు కొద్ది సేపటి క్రితం కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 13 వ తేదీన, అలాగే 15వ తేదీన ఎన్నికల కమిషన్ ఏ ఆదేశాలు అయితే ఇచ్చిందో, ఆ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాలని, స్పష్టం చేసింది. దీంతో పాటు ఒక గ్రామానికి సంబందించిన ఒక ఓటర్ ఎవరైనా సరే, తమ గ్రామానికి సంబందించిన ఓట్ల లెక్కింపు వీడియో షూట్ చేయాలని అధికారులకు విజ్ఞాపన పత్రం ఇస్తే, కచ్చితంగా వీడియో షూట్ చేయాల్సిందే అని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన పంచాయతీ ఎన్నికల సమరం అత్యంత కీలకమైనది అని, అందుకని ప్రతి దశలోనే కూడా పారదర్శకంగా జరగాలని, ఇలా జరగాలని అంటే ఎన్నికల మొదలైన దగ్గర నుంచి, కౌంటింగ్ వరకు వీడియో షూట్ చేయాలని, టెక్నాలజీ సాకులు చెప్పటానికి వీలు లేదని స్పష్టం చేసింది. అందువల్ల రేపు అత్యంత కీలకమైన మూడో దశ పోలింగ్ జరుగుతుంది, ఈ నేపధ్యంలోనే వీడియో షూట్ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మలుపు తిప్పబోతున్నాయని చెప్పవచ్చు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read