ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి, ప్రభుత్వం వేసిన పిటీషన పై ఈ రోజు హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ఏమైతే సూచనలు చేసిందో, ఆ సూచనలు ఆర్డర్ రూపంలో హైకోర్టు వెలువరించింది. ఇందులో ప్రధానంగా ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించింది. దీని పై ఎన్నికల కమిషన్ తరుపు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు, గతంలో ఇచ్చిన ఆదేశాలనే తుది తీర్పుగా, ఈ రోజు బెంచ్ మీద నుంచి ఆర్డర్స్ రూపంలో ఇచ్చింది. చర్చల ప్రక్రియను, అటు ఎన్నికల కమిషన్, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టాలని ఆదేశించింది. హైకోర్టు ఆర్డర్ కాపి అందిన వెంటనే, మూడు రోజుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి కంటే ఎక్కువ ఉన్న ముగ్గురు అధికారులను ఎన్నికల కమిషన్ వద్దకు పంపాలని ఆదేశించింది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ సరైన వేదికను నిర్ణయించి, సరైన సమయం చెప్పాలని చెప్పి సూచించింది. ప్రభుత్వం తమ అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ వద్దకు తీసుకు వెళ్లాలని, ఈ సందర్భంగా హైకోర్టు తెలిపింది.

hc 29122020 2

ఎన్నికల కమిషన్ కూడా, ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహించాలి అనుకుంటుంది కూడా ఆ అంశాన్ని కూడా ఎన్నికల కమిషన్, ప్రభుత్వానికి తెలిపాలని సూచించింది. ఈ రోజు ఆర్డర్ కాపిని వెంటనే ఇస్తాం అని, ఈ ఆర్డర్ కాపీ వచ్చిన తరువాత, మూడు రోజుల్లో అధికారులని ఎన్నికల కమిషన్ వద్దకు పంపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ రోజు సాయంత్రం, కానీ రేపు కానీ ఈ ఆర్డర్ కాపి వచ్చే అవకాసం ఉంది. దీంతో ప్రభుత్వం వేసిన పిటీషన్ ను హైకోర్టు ఈ రోజు డిస్పోజ్ చేసింది. చర్చలు కొలిక్కి రాకపోతే, మళ్ళీ వాదనలు వింటాం అని హైకోర్టు తెలిపింది. అంటే ఆర్డర్ కాపీ వచ్చిన తరువాత, మూడు రోజుల్లో ఏ సంగతి తేలిపోనుంది. గతంలో హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల కమీషనర్ అన్ని పార్టీలతో, ప్రభుత్వం అధికారులతో, మిగతా అందరితో కలిసి ఎన్నికల నిర్వహణ పై అభిప్రాయాలు తీసుకున్నారు. అందరి సూచనలు తీసుకున్న ఎన్నికల కమిషనర్, ఫిభ్రవరిలో ఎన్నికలు ఉంటాయాని ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే ప్రభుత్వం మాత్రం, మేము ఎన్నికల నిర్వహణకు రెడీగా లేం అని, క-రో-నా కేసులు అంటూ ఒకసారి, వ్యాక్సిన్ అంటూ మరోసారి చెప్పి, హైకోర్టుకు వెళ్లారు. దీంతో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read