ఏపి ప్రభుత్వ పెద్దలే కాదు, అధికారులు కూడా కోర్టులను లెక్క చేయని సంఘటనలు, ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి. వారానికి రెండు మూడు సార్లు, ఈ ధిక్కార పిటీషన్లలో అధికారుల పై హైకోర్టు చర్యలు తీసుకుంటుంది. ఈ మధ్య కాలంలో, పెద్ద హోదాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కూడా హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఇలా పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు కూడా ఎందుకు ఇలా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారో అర్ధం కాని పరిస్థితి. తాజాగా ఈ రోజు ఏపి హైకోర్టులో, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణకు జైలు శిక్షతో పాటుగా, 50 వేల రూపాయల జరిమానా విధించేందుకు కూడా హైకోర్టు సిద్ధం అయ్యింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా కలిదిండి గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీమన్నారాయణ తనకు జీతబత్యాలు కావలి అని చెప్పి హైకోర్టులో పిటీషన్ వేసారు. అయితే అతనికి వెంటనే జీతబత్యాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. గత వారం దీనికి సంబంధించి, ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణను హైకోర్టుకు హాజరుకావలి అంటూ హైకోర్టు ఆదేశించింది. అయితే అప్పటికే ఆర్ధిక శాఖ కార్యదర్శి, జీత బత్యాలు చెల్లించారు. అయితే కోర్టు ఆదేశాలు ప్రకారం, కోర్టుకు రావాటంలో జాప్యం జరిగింది. కోర్టు చెప్పిన సమయానికి ఆయన కోర్టుకు రాలేదు.
మధ్యానం మూడు గంటలకు ఆయన కోర్టుకు వచ్చారు. ఈ లోపు కోర్టు సమయం ముగిసింది. అయితే కావాలనే కోర్టును లెక్క చేయకుండా నిర్ల్యక్షంగా వ్యవహించారని గత వారం రాష్ట్ర హైకోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ రోజు కోర్టుకు హాజరు అయిన సత్యన్నారాయణ తన పై వేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ రీకాల్ చేయాలఐ పిటీషన్ వేసారు. అయితే ఈ పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించింది. అంతే కాకుండా తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. ఆయనకు 50 వేల రూపాయల జరిమానాతో పాటుగా శిక్ష విదిస్తున్నాం అని, వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తాము 50 వేల రూపాయలు చెల్లించలేమని సత్యన్నారాయణ తరుపు న్యాయవాది చెప్పటంతో, హైకోర్టు మాత్రం మీరు కావాలనే నిర్ల్యక్ష్యం చేసారు కాబట్టి, జైలు శిక్ష విధిస్తూ, జరిమానాను 10 వేలకు తగ్గించింది. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు పై, హైకోర్టు ధర్మాసనం ముందు సత్యన్నారాయణ న్యాయవాదులు ప్రస్తావించగా, లంచ్ తరువాత దీన్ని పరిశీలిస్తామని హైకోర్టు చెప్పింది.